Tuesday, April 23, 2024

కారులో ఉబర్ క్యాబ్ డ్రైవర్ హస్త ప్రయోగం…

- Advertisement -
- Advertisement -

 

ఢిల్లీ: ఉబర్ క్యాబ్ డ్రైవర్ కారు నడిపిస్తూ ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని ముందు హస్త ప్రయోగం చేసిన సంఘటన ఢిల్లీలోని గురుగ్రామ్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….  విద్యార్థిని కాలేజీకి వెళ్లడానికి సెక్టార్ 51 నుంచి హుడా సిటీ కి ఉబెర్ క్యాబ్ బుక్ చేసింది. ఆమె కారులో కూర్చున్న తరువాత డ్రైవర్ ఆమె వైపు వెకిలిగా చూశాడు. కారు లోపల ఉన్న మిర్రర్‌లో ఆమెను కామంతో చూస్తూ డ్రైవ్ చేస్తున్నాడు. మిర్రర్‌లో డ్రైవర్ కనిపించకుండా పక్కకు వచ్చింది. అతడు తన మర్మాంగంతో హస్త ప్రయోగం చేశాడు. ఈ ఘటనతో విద్యార్థిని భయంతో వణికిపోయింది. ఢిల్లీ మెట్రో స్టేషన్ రాగానే కారులో నుంచి బయటకు దూకి తప్పించుకుంది. వెంటనే ఆటోలో తన ఇంటికి చేరుకుంది. జరిగిన విషయం తన తండ్రికి చెప్పడంతో ఆయన స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. అనంతరం బుక్ చేసిన యాప్ ద్వారా డ్రైవర్‌ను గుర్తించారు. హిస్సార్ ప్రాంతంలో డ్రైవర్ మనోజ్ నివసిస్తున్నట్టు పోలీసుల గుర్తించారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. గతంలో నిందితుడు ఓ కేసులో బెయిల్ విడుదలై కారు డ్రైవింగ్ చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.

 

Uber Taxi driver masturbates in front of DU student

 

Uber Taxi driver masturbates in front of DU student
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News