Home జాతీయ వార్తలు యూనివర్సిటీల ఫైనల్ పరీక్షలపై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరణ

యూనివర్సిటీల ఫైనల్ పరీక్షలపై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరణ

UGC firm on direction to conduct final exams by Sept

 

న్యూఢిల్లీ: సెప్టెంబర్‌లో ఫైనల్ పరీక్షలు నిర్వహించాలంటూ యూనివర్సిటీలకు యుజిసి ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కరోనా ఉధృతి నేపథ్యంలో పరీక్షలు రద్దు చేయాలంటూ పలు పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. వాటిపై జస్టిస్ అశోక్‌భూషణ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపింది. తదుపరి విచారణను ఆగస్టు 10కి వాయిదా వేసింది. కేంద్ర హోంశాఖ నుంచి దీనిపై వివరణ కోరింది. ఆగస్టు 7లోగా ఇరు పక్షాలను అఫిడవిట్లు దాఖలు చేయాల్సిందిగా ఆదేశించింది. కేంద్రం, యుజిసి తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా విచారణకు హాజరయ్యారు. దేశంలోని మొత్తం 800 యూనివర్సిటీల్లో ఇప్పటికే 209 యూనివర్సిటీలు పరీక్షలు పూర్తి చేశాయని, మరో 390 యూనివర్సిటీలు పరీక్షల నిర్వహణ ప్రక్రియను ప్రారంభించాయని ఆయన తెలిపారు.

UGC firm on direction to conduct final exams by Sept