Thursday, April 25, 2024

సెమిస్టర్ పరీక్షలూ ఆన్‌లైన్‌లోనే

- Advertisement -
- Advertisement -
UGC says semester exams in online
ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో నిర్వహించుకోవచ్చన్న యుజిసి, భవిష్యత్తులో నిర్వహించేందుకు వర్సిటీల కసరత్తు

హైదరాబాద్ : కరోనా దెబ్బకు ఇప్పటికే డిగ్రీ,పిజి, ఇంజనీరింగ్ తదితర కోర్సుల తరగతులు ఆన్‌లైన్‌లో నిర్వహిస్తుండగా, ఈ సారి ఇంటర్ ఫలితాల తర్వాత రీవెరిఫికేషన్, రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల జవాబుపత్రాలను పూర్తిగా ఆన్‌లైన్ ద్వారానే మూల్యాంకనం చేశారు. భవిష్యత్తులో సెమిస్టర్ పరీక్షలు కూడా ఆన్‌లైన్ ద్వారా నిర్వహించేలా యూనివర్సిటీలు కసరత్తు చేస్తున్నాయి. అన్ని వర్సిటీల పరిధిలో నిర్వహించనున్న చివరి ఏడాది సెమిస్టర్ పరీక్షలను ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో లేదా రెండు విధానాలలో నిర్వహించవచ్చని ఇటీవల యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యుజిసి) జారీ చేసిన మార్గదర్శకాలలో స్పష్టం చేసింది. 2020-21 విద్యాసంవత్సరంలో ఆన్‌లైన్ పరీక్షలు ప్రారంభం కాకపోయినా, ఆ తర్వాత ఏడాది నుంచి ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించేందుకు వర్సిటీలు సిద్ధమవుతున్నాయి. ప్రణాళికలు సిద్ధం చేసుకోవడంతో పాటు ఆన్‌లైన్ పరీక్షల నిర్వహణకు సంబంధించి ప్రైవేటు సర్వీస్ ప్రొవైడర్లతో సంప్రదింపులు జరుపుతున్నాయి.పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పిజి, ఇంజినీరింగ్ వంటి అన్ని రకాల పరీక్షలనూ ఆన్‌లైన్ ద్వారా నిర్వహించే అవశాకాలు కనిపిస్తున్నాయి.

సదుపాయాలపై వర్సిటీ దృష్టి

యూరివన్సిటీలలో ఆన్‌లైన్ పరీక్షల నిర్వహణకు అవసరమైన మౌళిక పరీక్షలపై దృష్టి సారిస్తున్నారు. యూనివర్సిటీలలో మౌళిక సదుపాయాలు లేకపోవడం వల్లనే ఆన్‌లైన్ పరీక్షలు సాధ్యం కాదని గతంలో యుజిసి నియమించిన నిపుణుల కమిటీ అభిప్రాయపడింది. ఇప్పటికే యుజిసి ఆధ్వర్యంలో మూక్స్ విధానంలో విద్యాబోధన జరుగుతున్నది. పరీక్షలు ఆన్‌లైన్ ద్వారానే నిర్వహిస్తున్నారు. అందువల్ల పరీక్షల నిర్వహణ ఆన్‌లైన్‌లో సాధ్యమవుతుందని పలువురు అధ్యాపకులు అభిప్రాయపడుతున్నారు. ఆన్‌లైన్ పరీక్షలకు అవసరమైన మౌళిక సదుపాయాలు ఉంటే ఆన్‌లైన్ పరీక్షల నిర్వహణకు యుజిసి అనుమతి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ పరీక్షలకు అసవరమైన మౌళిక సదుపాయాలపై యూనివర్సిటీలు దృష్టి సారిస్తున్నాయి.

మౌలిక సదుపాయాలు లేకనే పరీక్షలు వాయిదా

ఉన్నత విద్యలో రెగ్యులర్ అకడమిక్ పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించడం సాధ్యం కాదని గతంలో యుజిసి నియమించిన నిపుణుల కమిటీ అభిప్రాయ పడింది. దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట యూనివర్సిటీలతో పాటు సెంట్రల్ యూనివర్సిటీల్లోనూ ఆ మేరకు సరిపడా మౌలిక సదుపాయాలు పేర్కొంది. యూనివర్సిటీల్లో వివిధ కోర్సులకు సంబంధించిన వార్షిక పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించడానికి అవసరమైన సదుపాయాలు లేనందునే మార్చి, ఏప్రిల్‌లో నిర్వహించాల్సిన సెమిస్టర్ పరీక్షలను యూనివర్సిటీలు వాయిదా వేశాయని కమి టీ అభిప్రాయపడింది.

ప్రస్తుత పరిస్థితుల్లో ఆన్‌లైన్ పరీక్షలు సాధ్యం కాదని, గ్రామీణ ప్రాంతాలకు చెందిన అనేక మంది విద్యార్థులకు ఆన్‌లైన్ సదుపా యం లేదని, అలాంటపుడు వారు ఆన్‌లైన్‌లో పరీక్షలు రాసే అవకాశమే లేద న్న అంశాలను కమిటీ తమ నివేదికలో పొందుపరిచింది సెమిస్టర్ పరీక్షలు ఆన్‌లైన్‌లో పరీక్షలను నిర్వహిస్తే విద్యార్థులు ఇళ్లలో ఉండి పరీక్షలు చూసి రాసే అవకాశం ఉంటుందని యుజిసి వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుత లాక్‌డౌన్ కారణంగా విద్యార్థులంతా గ్రామాల్లోని ఇళ్లకు వెళ్లిపోయారని, వారు ఆన్‌లైన్‌లో పరీక్షలు రాసేందుకు సరిపడా కంప్యూటర్లు లేవని, అసలు అది సాధ్యమే కాదని యూనివర్సిటీల అధికారులు పేర్కొంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News