Home జాతీయ వార్తలు విజయ్ మాల్యాను అప్పగించలేం

విజయ్ మాల్యాను అప్పగించలేం

UK Government not extradition Mallya to india

 

బ్రిటన్ స్పష్టీకరణ

న్యూఢిల్లీ: న్యాయపరమైన సమస్యలు పరిష్కారం కావాల్సి ఉందని, అప్పటివరకు విజయ్ మాల్యాను భారత్ అప్పగింత కుదరదని బ్రిటన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. బ్యాంకుల నుంచి వేల కోట్ల రుణాలు తీసుకుని బ్రిటన్‌కు పారిపోయిన పారిశ్రామికవేత్త మాల్యాను భారత్‌కు తీసుకురానున్నట్టు బుధవారం వార్తలు వెలువడ్డాయి. అయితే తాజాగా దీనికి సంబంధించి బ్రిటన్ అధికారులు భిన్నమైన వివరణలు ఇస్తున్నారు. బ్రిటన్‌లో ఉన్న మాల్యాను భారత్‌కు తీసుకొచ్చేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సిబిఐలు చాలా కాలంగా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి.

అయితే మాల్యాను ప్రస్తుతం బ్రిటన్ నుండి భారతదేశానికి రప్పించాలంటే అప్పగించే పత్రంపై సంతకంపై బ్రిటన్ నుండి అధికారిక సమాచారం లేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అప్పగించే పత్రాలపై సంతకం చేసినట్లు బుధవారం సాయంత్రం వార్తలు వచ్చాయి. బ్రిటన్ హోం ఆఫీస్ కార్యదర్శి నుండి అప్పగించే పత్రాలపై సంతకం చేయడానికి చివరి తేదీ జూన్ 11, కాగా మాల్యా బ్రిటన్‌లో రాజకీయ ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలుస్తోంది. అయితే సిబిఐ, ఇడికి బ్రిటన్ నుండి ఎటువంటి సమాచారం రాలేదని అధికార వర్గాలు తెలిపాయి.

UK Government not extradition Mallya to india