Wednesday, April 24, 2024

బ్రిటన్ ప్రధాని జాన్సన్ దంపతులకు ఆడబిడ్డ

- Advertisement -
- Advertisement -

UK PM Johnson Wife Gives Birth to Baby Girl

లండన్ : బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, కేరీ దంపతులకు ఆడబిడ్డ జన్మించింది. లండన్ ఆస్పత్రిలో గురువారం ఉదయం జన్మించిన ఈ ఆడబిడ్డ ఆరోగ్యంగా ఉందని ప్రధాని కార్యాలయం ప్రకటించింది. ప్రధాని దంపతులకు ఈమె రెండో సంతానం. 2020 ఏప్రిల్‌లో జన్మించిన మొదటి సంతానం విల్‌ఫ్రెడ్‌కు ఈ ఆడబిడ్డ చెల్లెలు. వీరు కాక జాన్సన్‌కు మరో ఐదుగురు పిల్లలు ఇదివరకటి భార్యల వల్ల కలిగారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News