Wednesday, April 24, 2024

రష్యా ప్రతినిధిపై పిడిగుద్దులు గుద్దిన ఉక్రెయిన్ ఎంపీ!

- Advertisement -
- Advertisement -

అంకారా: టర్కీ రాజధానిలో నల్ల సముద్ర దేశాల సమావేశంలో గురువారం ఉక్రెయిన్ ప్రతినిధి, రష్యా ప్రతినిధి ముఖంపై పిడిగుద్దులు కురిపించాడు. రష్యా లీడ్ డెలిగేట్‌తో వీడియో ఇంటర్వూలో ఫోటోబాంబింగ్ నుంచి ఆపడానికి అతని ఉక్రెయిన్ జెండాను లాక్కొన్న తర్వాత ఈ ఘటన జరిగింది. ఒలేసాండర్ మారికోవ్సీ తన ఫేస్‌బుక్ పేజీలో రష్యన్ ప్రతినిధిని కొట్టడం, నీలం, పసుపు జెండాను తిరిగి పొందడం తాలూకు వీడియోను పోస్ట్ చేశాడు. ఈ సంఘటన పార్లమెంట్ భవనంలోని హాలులో జరిగింది. నల్ల సముద్రం ఆర్థిక సహకార సంస్థ(బిఎస్‌ఈసి) సమావేశం అక్కడ జరిగింది.

దీనికి ముందు కొంత మంది ఉక్రెయిన్ ప్రతినిధులు అసెంబ్లీలో ప్రసంగించడానికి ప్రయత్నించినప్పుడు రష్యా లీడ్ డెలిగేట్ పక్కన తమ జెండాను పట్టుకుని, అరుస్తూ నిరసనను ప్రదర్శించినప్పుడు వారిని లాగేయడానికి ప్రయత్నించిన భద్రతా అధికారులతో కూడా వారు గొడవపడ్డారు.

గందరగోళానికి సంబంధించిన చిత్రాలను టర్కీ పార్లమెంటు తన వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసింది. పార్లమెంటు అధిపతి ముస్తఫా సెంటోప్ గట్టి మందలింపును జారీ చేశారు. ‘టర్కీ నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్న శాంతియుత వాతావరణానికి విఘాతం కలిగించే ఈ ప్రవర్తనను నేను ఖండిస్తున్నాను’ అని ఆయన అన్నారు.

బిఎస్‌ఈసిలోని 13 దేశాల ప్రతినిధులు గురువారం సమావేశం కాగా, ఉక్రెయిన్ రాజధాని కైవ్‌పై రష్యా డ్రోన్‌లు దాడి కొనసాగించాయి. ఉక్రెయిన్ పట్టణాలు, నగరాలను ధ్వంసం చేసిన, వేలాది మంది చంపిన, లక్షలాది మంది నిరాశ్రయులైన యుద్ధం ముగింపుకు ప్రస్తుతం శాంతి చర్చలకు తావులేకుండా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News