Home లైఫ్ స్టైల్ పోషకాహార లోపమే మానసిక వైకల్యానికి కారణమా ?

పోషకాహార లోపమే మానసిక వైకల్యానికి కారణమా ?

life1

మానసిక వైకల్యానికి పోషకాహార లోపమే ప్రధాన కారణమని ఒక పరిశోధనలో వెల్లడైంది. వీరి పరిశోధనలో భారతదేశంలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలలో పేదరికం, సరైన ఆహారం తీసుకోకపోవడం, అనారోగ్యం, తీవ్ర ఆహార కొరత, విద్య లేకపోవడం వంటివి మానసిక వైకల్యానికి దారితీస్తున్నాయని తేలింది. ముఖ్యంగా దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలలో, వ్యక్తులలో ఈ మానసిక వైకల్యం ఎక్కువగా కనిపిస్తుంది. కారణాలెన్నైనా, ముఖ్య కారణం మాత్రం పోషకాహార లోపమే. చిన్నతనంలో సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల చిన్న వయసులోనే పిల్లలు మనోవైకల్యానికి గురి అవుతున్నారు. అయితే, ఇది ఎంతవరకు సబబని అమెరికాలోని సౌత్ కెరోలినా విశ్వవిద్యాలయంలో వ్యవసాయశాఖలో పనిచేస్తున్న డాక్టర్ మైఖేల్ బుర్కేతో కూడిన బృందం 17వేల పిల్లల (4-11) తల్లిదండ్రులను, 12-17 సంవత్సరాల మధ్య వయసు పిల్లలను, వారి తల్లిదండ్రులను ప్రశ్నించి కనుగొన్న విషయమేమిటంటే, సరైన పోషకాహారం తీసుకోకపోవడమే ఈ సమస్యకు మూలకారణమని గుర్తించారు. 2011-14 సంవత్సరాల మధ్య నేషనల్ హెల్త్ ఇంటర్వ్యూ సర్వే (హెచ్‌హెచ్‌ఐఎస్) ఆధారంగా పిల్లల్లో యుక్తవయస్కుల్లో ఈ వైకల్యం ఎక్కువగా ఉన్నట్టు గుర్తించింది. యునైటెడ్ స్టేట్స్ వ్యవసాయశాఖ కు చెందిన పరిశోధకుల నిర్వచనం ప్రకారం తక్కువ లేదా చాలినంత పోషకాహారాన్ని తీసుకోకపోవడమే ఈ సమస్యకు మూలకారణమని వెల్లడించారు. వాళ్లు తయారుచేసిన గణాంకాల జాబితాలో పిల్లలు (ఆడ, మగ), వారి సంరక్షకుల విద్యాస్థాయి, జాతి, సంతతి, కుటుంబ పరిస్థితులు, సంపాదన వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఒక కుటుంబంలో పిల్లలు లేదా పెద్దలు మానసిక వైకల్యంతో ఉండడానికి గల కారణం ఆహార కొరత తీవ్రతేనని పరిశోధకులు గుర్తించారు. ఆహార కొరతతో బాధపడుతున్న కుటుంబాలు 244శాతం నుండి 344 శాతం వరకు ఉండొచ్చని తేల్చారు. ప్రతి ఇంట్లో తీవ్ర ఆహార కొరత తీవ్రతను తగ్గించగలిగితే మానసిక వైకల్యంతో బాధపడే వ్యక్తుల సంఖ్యను కూడా గణనీయంగా తగ్గించవచ్చని వారు పేర్కొన్నారు. ఒక్క ఆహార కొరతేనా లేక మరియేతర కారణాలు ఈ మానసిక వైకల్యానికి మూలకారణాలు అవుతున్నాయన్న అంశం మీద విస్తృత పరిశోధనలు జరపాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. హింస కూడా మానసిక వైకల్యానికి దోహదపడొచ్చన్నారు.  భారతదేశంలో పోషకాహారం లోపం, పేదరికం సర్వవ్యాపితమై ఉన్నాయనడానికి పిల్లల్లో పోషకాహారలోపం, ఎదుగుదల లేకపోవడమే తార్కాణమన్నారు.  స్త్రీ, శిశు సంక్షేమ శాఖ పిల్లలపై జరిపిన ర్యాపిడ్ సర్వేలో 29.4శాతం పిల్లలు (మూడేళ్లలోపు)వాళ్ల వయసుకు తగ్గ బరువు లేకుండా, 15శాతం మంది ఎత్తుకు తగ్గ బరువు లేకుండా, 38.7శాతం వయసుకు తగ్గ ఎత్తు లేకుండా ఉన్నారని వెల్లడించారు.