Friday, April 26, 2024

చదువురాని బామ్మ నోట అమెరికన్ ఇంగ్లీష్ మాట

- Advertisement -
- Advertisement -

న్యూస్‌డెస్క్: అక్షర జ్ఞానం లేని ఒక 70 ఏళ్ల బామ్మ హఠాత్తుగా అమెరికన్ యాసలో తెలుగు మాట్లాడితే ఎలా ఉంటుంది.? హైదరాబాద్‌లో నివసించే ఆ బామ్మగారు చదువుకోలేదు. అమెరికాలో ఆమెకు బంధువులూ లేరు&ఆమె ఏనాడూ అక్కడకు వెళ్లింది లేదు. ఏడాది క్రితం ఒక రోజు ఉదయం నిద్రలేవగానే ఆ బామ్మ అమెరికన్ ఇంగ్లీష్ యాసలో తెలుగులో మాట్లాడుతుంటే ఆమె కుమారుడు బిత్తరపోయాడు. తన ల్లికి ఏమైందోనని కంగారుపడ్డాడు. కరోనా వైరస్ బారినపడిన తన తల్లి అనేక నెలలపాటు చికిత్ససొందుతూ ఐసోలేషన్‌లో ఉన్నందువల్ల మతిభ్రమించిందేమోనని కూడా అతను భావించాడు. వెంటనే ఒక సైక్రియాటిస్టు వద్దకు ఆమెను తీసుకువెళ్లాడు. ఆమె మాట తీరులో మార్పు కనపడుతోందే తప్ప ప్రవర్తనలో ఎటువంటి అసహజ లక్షణాలు కనిపించకపోవడంతో న్యూరాలజిస్టుకు ఈ కేసు ఆయన రిఫర్ చేశారు.

ఈ కేసును టేకప్ చేసిన హైదరాబాద్‌లోని సీనియర్ న్యూరాలజిస్టు డాక్టర్ సుధీర్ కుమార్ ఆమె మెదడుకు ఎంఆర్‌ఐ చేయించగా మెదడులోని ముందు భాగంలో(మాట పలికే ప్రాంతం) రక్త ప్రసరణ లోపం కారణంగా కణాలు దెబ్బతినడం వల్ల మాట దెబ్బతిందని డాక్టర్ గుర్తించారు. ఇది అత్యంత అరుదైన వ్యాధని, మెదడులోని స్పీచ్ ఏరియాలో స్ట్రోక్ వల్ల ఇలా జరుగుతుందని డాక్టర్ సుధీర్ కుమార్ తెలిపారు. ఆమెకు మాట్లాడడం చాలా కష్టంగా మారిందని, మెల్లగా ఒక్కో మాట పలకడం వల్ల అది అమెరికన్ ఇంగ్లీష్ యాసలో వినపడిందని ఆయన తెలిపారు. ఫారిన్ యాక్సెంట్ సిండ్రోమ్(ఎఫ్‌ఎఎస్) అనే ఈ అరుదైన వ్యాధి మానసిక ఒత్తిళ్లు, లేదా తలకు బలమైన గాయాలు తగలడం వల్ల ఏర్పడుతుందని ఆయన చెప్పారు. ఆ 70 ఏళ్ల బామ్మకు చికిత్సలో భాగంగా డాక్టర్లు స్పీచ్ థెరపీ ఇచ్చారని, ఆరు నెలలలో ఆమె మాటతీరు పూర్వస్థితికి వచ్చిందని డాక్టర్ సుధీర్ కుమార్ తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News