Wednesday, March 29, 2023

గుర్తుతేలియని వాహనం ఢీకోని విద్యార్థి మృతి

- Advertisement -

scooters

మనతెలంగాణ / కందుకూరు ః గుర్తుతెలియని వాహనం ఢీకోని యువకుడు మృతిచెందిన సంఘటన కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం కందుకూరు మండల కేంద్రానికి చెందిన కళ్యాణ్‌కార్ సతిష్( 21) తండ్రి పూర్ణచందర్ సోమవారం ఉదయం 06 గంటల సమీపంలో పని నిమిత్తం హైద్రాబాద్‌కు ఎపి28 ఎహెచ్5392 స్కూటర్ వాహనంపై వెళుతున్నాడు. హైద్రాబాద్ శ్రీశైలం ప్రధాన రహదారి గూడూరు గేటు సమీపంలో గల వంతెన వద్ద వెనుక నుండి వెగంగా వచ్చిన గుర్తుతేలియన లారీ స్కూటర్‌ను ఢీకోనడంతో సతీష్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోలిసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News