Home జాతీయ వార్తలు ‘తక్కువ ఖర్చుతో మొబైల్ డేటా, వాయిస్ కాల్’

‘తక్కువ ఖర్చుతో మొబైల్ డేటా, వాయిస్ కాల్’

 

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రహదారుల నిర్మించామని తాత్కాలిక ఆర్థిక శాఖ మంత్రి పియూష్ గోయల్ తెలిపారు. శుక్రవారం లోక్ సభలో  పియూష్ గోయల్ ఆరో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా గోయల్ మాట్లాడారు. ప్రతి రోజూ 27 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం చేపట్టామని వివరించారు. సాగర్‌మాల కింద పోర్టుల ద్వారా సరకు రవాణా చేస్తున్నామన్నారు. బ్రహ్మపుత్ర ద్వారా ఈశాన్య రాష్ట్రాలకు సరకు రవాణా చేస్తామని వెల్లడించారు. టెలికాం రంగంలో విప్లవాత్మకమైన సంస్కరణలు చేపట్టామని, ప్రపంచంలోనే అతి తక్కువ ఖర్చుతో మొబైల్ డేటా, వాయిస్ కాల్ ఇస్తున్నామన్నారు. సోలార్ విద్యుదుత్పత్తిలో 10 రెట్లు వృద్ధి చెందామని, 24 గంటల్లోనే ఐటిఆర్, ప్రాసెస్, రిఫండ్ ఇస్తామన్నారు. దేశ వ్యాప్తంగా తొమ్మిది ప్రాంతాల్లో కృత్రిమ మేధ సెంటర్లు ఏర్పాటు చేస్తామని పియూష్ హామీ ఇచ్చారు.

 

Union Budget 2019 : Every Day 29 KM’s Roads Construct