Home ఎడిటోరియల్ కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి దగా

కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి దగా

Union Budget

 

తెలంగాణకు కేంద్రం నుండి ఆశించిన స్థాయిలో బడ్జెట్ సాయం అందలేదు. ఆరేళ్ళుగా కేంద్ర పన్నుల వాటా, గ్రాంట్ ఇన్ ఎయిడ్ మినహా ప్రత్యేకంగా నిధులేమీ రావడం లేదు. విభజన హామీలను అమలు చేయడం లేదు. కొత్త డిమాండ్లను పట్టించుకోవడం లేదు. రాష్ట్రానికి రూ. 24,205 కోట్లు ఇవ్వాలని నీతి అయోగ్ మూడేళ్ళ క్రితమే చెప్పినా పట్టించుకోలేదు. లక్ష కోట్లతో నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చి చేయూతనివ్వాలని చేసిన వినతికి కేంద్రం స్పందించలేదు. మిషన్ భగీరథ, కాకతీయ మిషన్, కాళేశ్వరం ఎత్తి పోతల పథకాలను కేంద్ర అధికారులు పలుమార్లు పరిశీలించి, ప్రశంసించారు. అయినా ఈ పథకాలకు నిధుల భరోసా ఇవ్వడం లేదు. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు కేంద్రం పన్నుల్లో రాష్ట్రాల వాటా 42 శాతం. 2014 15 నుండి 2017 18 మధ్య వరకు ఈ వాటా పెరిగినా తర్వాత క్రమంగా తగ్గింది. దీనికి ఆర్థిక మాద్యం కారణం అని కేంద్రం చెబుతోంది.

201819లో రాష్ట్రానికి అందిన నిధుల వాటా కంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 6.2 శాతం అధికంగా పెరుగుతుందని కేంద్రం ప్రకటించింది. 201920, 2020 21 బడ్జెట్‌లో ఆ స్థాయిలో పెరగకపోగా 2.19 శాతం మేర తగ్గింది. కేంద్రం మరింత తగ్గిస్తుందనే అభిప్రాయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ విభాగాలు పేర్కొనడం గమనార్హం. ఈ ఏడాది గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో రాష్ట్రానికి రూ. 8,177 కోట్లు వస్తాయని అంచనా వేయగా, డిసెంబర్ వరకు 7,942 కోట్లు మాత్రమే వచ్చాయి. గత ఆరేళ్ళలో రాష్ట్రాల పన్నుల వాటా, గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో అందిన మొత్తం వివరాలు: 2014 15లో కేంద్రం పన్నుల వాటా నుండి రావాల్సింది రూ. 9,749 కోటు,్ల వచ్చింది రూ. 8,185 కోట్లు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో రావాల్సింది రూ. 21,720 కోట్లు వచ్చింది రూ. 7,118 కోట్లు. 201516లో కేంద్ర పన్నుల వాటా కింద రావాల్సింది రూ. 12,595 కోట్లు, వచ్చింది రూ. 12,350 కోట్లు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద రావాల్సింది రూ. 12,460 కోట్లు, కానీ వచ్చింది రూ. 9,394 కోట్లు.

201617లో కేంద్ర పన్నుల వాటా కింద రావాల్సింది రూ. 14,876 కోట్లు, వచ్చింది రూ. 14,876 కోట్లు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద రావాల్సింది రూ. 13,557 కోట్లు, వచ్చింది రూ. 9,751 కోట్లు. 201718లో కేంద్ర పన్నుల వాటా కింద రూ. 16,420 కోట్లు, వచ్చింది రూ. 16,420 కోట్లు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద రావాల్సింది రూ. 23,759 కోట్లు, రూ. వచ్చింది 8,058 కోట్లు. 201819 కేంద్ర పన్నుల వాటా కింద రావాల్సింది రూ. 17,960 కోట్లు, వచ్చింది రూ. 13,614 కోట్లు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద రావాల్సింది రూ. 28,041 కోట్లు, వచ్చింది రూ. 8,177 కోట్లు. 2019 20లో కేంద్ర పన్నుల వాటా కింద రావాల్సింది రూ. 19,718 కోట్లు, వచ్చింది రూ. 8,449 కోట్లు. ఇది జిఎస్‌టితో కలుపుకొని వచ్చిన మొత్తం, గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద రావాల్సింది రూ. 8,117 వచ్చింది రూ. 7,942 కోట్లు.

ఎంతో కాలంగా అర్జీల మీద అర్జీలు పలు మార్లు విజ్ఞప్తులు చేసినా కేంద్ర పట్టించుకోలేదు. బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని, కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ హోదా కల్పించాలని, కాజీపేటలో వ్యాగన్ మరమ్మత్తుల కేంద్రం నిర్మించాలని, రాష్ట్రంలో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని, మిషన్ భగీరథ, కాకతీయ పథకాలకు నిధులివ్వాలని నీతి అయోగ్ సిఫారసు చేసినా పట్టించుకోలేదు, రాష్ట్రంలో పూర్వపు తొమ్మిది జిల్లాలకు ఒక్కో దానికి రూ. 50 కోట్లు చొప్పున వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం నిధులు అందజేస్తోంది. జిల్లాల పునర్విభజన జరిగి జిల్లాల సంఖ్య పెరిగిన రీత్యా కొత్త జిల్లాల ప్రాతిపదికగా నిధుల కేటాయించాలన్న ప్రతిపాదనను పట్టించుకోలేదు.

పన్నుల వాటాలో రాష్ట్రాలకు వచ్చే నిధుల్లో ఒక శాతం కోత పడింది. 202021 సంవత్సరానికి రాష్ట్రాలకు వచ్చే కేంద్ర నిధులు 42 శాతం నుండి 41 శాతానికి తగ్గించాలని ఎస్.కె.సింగ్ నేతృత్వంలోని 15వ ఆర్థిక సంఘం సిఫారసు చేసింది. జమ్మూ కశ్మీర్, లద్దాక్ కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేయడంతో వాటి భద్రతాపరమైన ప్రత్యేక అవసరాల కోసం నిధులు తగ్గించాల్సి వచ్చిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఐజిఎస్‌టి నిధులను, పరిహార సుంకాన్ని కేంద్రం చట్ట విరుద్ధంగా సంచిత నిధిలో జమ చేసి వాడుకుంటోంది. 201718 కాగ్ నివేదిక ప్రకారం, రాష్ట్రాల రెవెన్యూలో 201516లో రూ. 35 వేల కోట్లను రాష్ట్రాలకు 2017లో పంచగా కేంద్రం వద్ద రూ. 1,76,688 కోట్లు మిగిలాయి. అనంతరం ఆర్థిక సంఘం సిఫారసులు పాటించకుండానే రూ. 67,998 కోట్లు విడుదల చేయడంతో కొన్ని రాష్ట్రాలకు తక్కువ నిధుల వచ్చాయి.

రాష్ట్రాల బలోపేతం, సమయ స్ఫూర్తితో టీవ్‌ు ఇండియా నిర్మాణం లక్ష్యంగ నీతి అయోగ్ ఏర్పాటు చేసినా ఆ దిశగా కేంద్రం చర్యలేవీ లేవు. కేంద్ర ప్రయోజిత పథకాలను హేతుబద్ధీకరించాలని, కొన్ని పథకాలను రద్దు చేయాలని 2016లో ఏర్పాటైన ముఖ్యమంత్రుల ఉప సంఘం సిఫారసులను పట్టించుకోలేదు. రాష్ట్రాలే పథకాలను ఎంచుకునే వీలుగా ఏక మొత్తంలో నిధులివ్వాలన్న సూచననూ అమలు చేయలేదు. రాష్ట్రాల జాబితాలోని అంశాలపై నిధుల ఖర్చును 14 నుంచి 20 శాతం వరకు, ఉమ్మడి జాబితాలోని అంశాలపై 13 నుండి 17 శాతం వరకు కేంద్రం పెంచిందని, వాటిలో కోత విధించి రాష్ట్రాలకు నిధులను బదిలీ చేయాలని ముఖ్యమంత్రుల ఉప సంఘం తీర్మానించింది.

తెలుగు రాష్ట్రాలకు 41 శాతం నిధుల పంపిణీ ప్రకారం కేంద్ర పన్నులు, సుంకాల రూపంలో ఎపికి రూ. 32,237.66 కోట్లు వస్తాయి. తెలంగాణకు రూ. 16,726.5 కోట్లు వస్తాయి. గత ఏడాది తెలంగాణకు పన్నులు, సుంకాల్లో వాటా 2.437 శాతం అంటే రూ.15,987.59 కోట్లు వస్తాయి. ఈ ఏడాది దాన్ని 2.133 శాతానికి కుదించారు. అంటే రూ. 16,726 కోట్లు ఇందులో కార్పొరేట్ టాక్స్ రూపేణా రూ. 5,145.05 కోట్లు , ఆదాయ పన్ను రూపేణా రూ. 4,783.97 కోట్లు, కేంద్ర జిఎస్‌టి రూపేణా రూ. 5,062.70 కోట్లు. కస్టవ్‌‌సు రూపేణా రూ. 1,044 కోట్లు, ఎక్సైజ్ సుంకం రూపేణా రూ. 682.11 కోట్లు వస్తాయి. సర్వీస్ టాక్స్ రూపేణా రూ. 74.99 కోట్లు వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాంతీయ రింగ్ రోడ్డు నిర్మాణానికి కేంద్రం నిధులు ఇవ్వలేదు. ప్రస్తుతం వున్న అవుటర్ రింగ్ రోడ్డుకు ఆవల అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రాంతీయ రింగ్ రోడ్డును నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. దీనిని జాతీయ రహదారిగా గుర్తించి కేంద్ర ప్రభుత్వమే నిధులివ్వాలని విజ్ఞప్తి చేసింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణాకు బడ్జెటులో భారీ షాక్ ఇచ్చింది. డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీ బాదుడుతో ఈ సంస్థపై ఏటా రూ. 18 కోట్ల మేర అదనపు భారం పడనుంది.

డీజిల్‌పై సుంకం లీటరుకు 1 రూపాయి పెరగడం అదనపు భారంగా మారింది. ప్రస్తతం ఆర్‌టిసికి 8,433 సొంత బస్సులున్నాయి. వీటి కోసం నెలకు సగటున కోటిన్నర లీటర్ల చొప్పన ఏటా 18 కోట్ల లీటర్ల మేర డీజిల్‌ను వినియోగిస్తున్నారు. చమురు సంస్థలు ఆర్‌టిసికి 2.50 నుండి 3.00 రూపాయల వరకు రాయితీపై డీజిల్‌ను అందిస్తున్నాయి. ఇప్పటికే ఆర్‌టిసి రూ. 3,200 కోట్ల నష్టాలలో ఉంది. 2018లోనే అప్పటి నిజామాబాద్ ఎంపి కవిత చొరవతో నాటి కేంద్ర మంత్రి సురేశ్ ప్రభు నిజామాబాద్ కేంద్రంగా స్పైస్ డెవలప్‌మెంటు పార్కును ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ స్పైస్ పార్కునే ఇప్పుడు 2020లో ప్రకటించారు. పసుపు బోర్డు కావాలని పసుపు రైతులు ఎప్పటి నుండో పోరాడుతున్నారు. బిజెపి నాయకులు గొప్పగా చెపుతున్న స్పైస్ బోర్డు పాతదే. ఇప్పటికైనా బిజెపి ఎంపిలు పసుపు బోర్డు ఏర్పాటు చేయించేందుకు ప్రయత్నించాలి.

తెలంగాణలో రైల్వేలు ఆశించిన రీతిలో ప్రగతి పట్టాలెక్కడం లేదు. మెరుగైన సౌకర్యాల కోసం ఎన్నో డిమాండ్లు చేసినా వాటికి అతీగతీ లేదు. రైల్వే శాఖ ఆమోదం తెలిపిన కొత్త లైన్లు వేయడం లేదు. దేశ వ్యాప్తంగా ఉన్న రైలు మార్గంలో తెలంగాణ సగటున 2.7 శాతం మాత్రమేనంటే పరిస్థితి ఏ రీతిలో ఉందో స్పష్టమవుతుంది. కొత్తగా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు ప్రక్రియ జరుగుతోంది. సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోని గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లు కొత్తగా ఏర్పడే జోన్‌లోకి వెళ్ళనున్నాయి. దీంతో ఇక దక్షిణ మధ్య రైల్వేలో మిగిలేవి సికింద్రాబాద్, హైదరాబాద్‌తో పాటు మహారాష్ట్రలోని నాందేడ్ డివిజన్ మాత్రమే. తెలంగాణలో రెండు డివిజన్లే మిగిలే అవకాశం ఉండటంతో కొత్తగా కాజీపేట డివిజన్ ఏర్పాటు చేయాలని, బడ్జెట్‌లో దీన్ని ప్రకటించాలని అన్ని వర్గాల ప్రజలు కోరుతున్నారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ 1980ల్లోనే మంజూరైనప్పటికీ ఆ తర్వాత పంజాబు తరలించారు. ఇకనైనా కొత్త కోచ్ ఫ్యాక్టరీ మంజూరు చేయాలనే డిమాండు ఉంది.

అక్కన్నపేట మెదక్ (కేవలం 17 కి.మీలు) రైల్వే లైను 2012 13లో మంజూరైంది. ఏడేళ్ళైనా ఇంకా పనులు చివరి దశలోనే ఉన్నాయి. మనోహరాబాద్ కొత్తపల్లి, భద్రాచలం సత్తుపల్లి, కాజీపేట బలార్ష (మూడోలైను), ఘట్‌కేసర్ యాదాద్రి, ఉందానగర్ మహబూబ్‌నగర్ (డబ్లింగ్) వీటికి నిధులు ఇవ్వటం లేదు. రూ. 2800 కోట్ల వ్యయంతో 220 కి.మీల ఆర్మూర్‌నిర్మల్ అదిలాబాద్ మధ్య కొత్త రైల్వే లైనుకు కేంద్రం మూడేళ్ళ క్రిందట ప్రకటించింది. ఆ తర్వాత ఇప్పటి వరకు బడ్జెట్‌లో రూపాయి కేటాయించలేదు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ చాలా వెనుకబడి ఉంది. అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 9,167 కి.మీల రైలు మార్గముంది. రాజస్థాన్‌లో 5,894, మహారాష్ట్రలో 5,784, గుజరాత్‌లో 5,259, పశ్చిమ బెంగాల్‌లో 4,139, తమిళనాడులో 4028, ఆంధ్రప్రదేశ్‌లో 3,817, ఆఖరికి చిన్న రాష్ట్రమైన జార్ఖండ్‌లో కూడా 2,455 కి.మీ రైలు మార్గముంది. తెలంగాణలో కేవలం ఆ సంఖ్య కనీసం రెండు వేల కి.మీ దాటలేదు.

అభివృద్ధి పథంలో తెలంగాణ: తెలంగాణకు ఆరేళ్ళలో రూ. లక్షన్నర కోట్లు ఇచ్చాం అని కేంద్ర అర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా లేదు. రెవెన్యూ మిగులే ఉందని పార్లమెంటు సమావేశాల్లో చివరి రోజున చెప్పారు. రాష్ట్రాలు భారీ ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టినా, భారీ ప్రాజెక్టులు కడుతున్నా కేంద్రం తన వంతుగా ఆర్థిక సహాయం చేసే ఆనవాయితీ ఉంది. తెలంగాణలో భారీ ప్రాజెక్టయిన కాళేశ్వరం ఒక్కటే రూ. లక్ష కోట్ల్ల ప్రాజెక్టు. దీనితో 75 నుంచి 80 లక్షల ఎకరాలు పండిస్తుంది. ఈ నీళ్ళతో 400 చెరువులను నింపనున్నారు.

తెలంగాణలో ఇరిగేషన్ ప్రాజెక్టులను ఆదాయ వనరులుగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల నుండి ఏటా సుమారు రూ. 5 నుంచి 6 కోట్ల ఆదాయం రాబట్టాలని అంచనా వేస్తోంది. వాటి పరిధిలో పరిశ్రమలు, మత్స్య, పర్యాటకం వంటి విభాగాలను పెద్ద ఎత్తున ప్రోత్సహించి, వాటి ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టులను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. వీటి నిర్వహణా వ్యయం, నీటిని లిఫ్ట్‌ంగ్ కోసం పెద్ద ఎత్తున విద్యుత్తు చార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టులను నిర్మించడానికి భారీగా రుణాలను కూడా తీసుకుంది. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి అయిన తర్వాత కూడా సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించాల్సి ఉంటుంది.

Union Budget proposals totally disappointing to Telangana