Friday, March 29, 2024

ఆత్మహత్యలపై కేంద్రం డేటా వెల్లడి

- Advertisement -
- Advertisement -

Union Home Ministry released NCRB data on suicides

న్యూఢిల్లీ : ఆత్మహత్యలపై కేంద్ర హోంశాఖ మంగళవారం ఎన్‌సీఆర్‌బీ డేటాను విడుదల చేసింది. సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లోక్‌సభలో ఓ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2018.2019,2020 సంవత్సరాల్లో 1,34,516, 1,39,123, 1,53,052 మంది బలవన్మరణానికి పాల్పడినట్టు మంత్రి తెలిపారు. అయితే ఇక 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల లోపు యువతలో 46912, 48774,52718, మంది మరణించినట్టు ఆయన వెల్లడించారు. యాక్సిడెంటల్ డెత్స్ అండ్ సూసైడ్స్ ఇన్ ఇండియా పేరుతో ఎన్సీఆర్బీ డేటాను విడుదల చేసింది. సూసైడ్ రేటును కూడా ఆ డేటాలో పొందుపరిచారు. 2016,2017,2018,2019, 2020 లో లక్ష మంది జనాభాలో సూసైడ్ రేటు 10.3, 9.9,10.2,10.4 ,11.3 గా ఉన్నట్టు పేర్కొన్నారు. అనేక కారణాలు ఆత్మహత్యలకు దారి తీసినట్టు తెలిపారు. కుటుంబం, పెళ్లి, వివాహేతర, ప్రేమ, విడాకులు, ప్రాపర్టీ సంబంధిత సమస్యలు వాటిలో ఉన్నాయి. 2019 నుంచి 2021 వరకు 81 మంది చైనా జాతీయులకు లీవ్ ఇండియా నోటీసు ఇచ్చినట్టు మంత్రి తెలిపారు. 117 మందిని డిపోర్టు చేశామని మంత్రి నిత్యానంద చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News