Home జాతీయ వార్తలు కశ్మీర్‌కు వెళ్లనున్న కేంద్ర హోంశాఖ కార్యదర్శి

కశ్మీర్‌కు వెళ్లనున్న కేంద్ర హోంశాఖ కార్యదర్శి

Rajiv-Mehershiన్యూఢిల్లీ : జమ్ముకశ్మీర్‌లోని యురి సెక్టార్‌లో ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ మెహర్షి సోమవారం కశ్మీర్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో రాష్ట్రంలో భద్రతా పరిస్థితులపై సమీక్ష నిర్వహించనున్నారు. హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం, ఆర్మీ, పోలీసులు, పారామిలిటరీ బలగాల ఉన్నతాధికారులతో వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. అనంతరం గవర్నర్ ఎన్‌ఎన్ వొహ్రా, ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీతో సమావేశమై శాంతిభద్రతలపై చర్చించనున్నట్లు సమాచారం. ఉగ్రదాడిలో 17 మంది జవాన్లు మరణించిన వెంటనే రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్, ఆర్మీ చీఫ్ దల్బిర్‌సింగ్ సుహాగ్ జమ్ముకశ్మీర్ చేరుకున్న విషయం తెలిసిందే.