Friday, April 19, 2024

ఖర్గే పై అమిత్‌షా ఆగ్రహం..

- Advertisement -
- Advertisement -

నవల్‌గండ్: కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ప్రధాని నరేంద్రమోడీని విషసర్పంతో పోల్చడంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలకు మతిభ్రమించిందని మండిపడ్డారు. ప్రపంచ దేశాలు మోడీని గౌరవంతో ఆహ్వానిస్తున్నాయన్నారు. కాంగ్రెస్ వివాదాస్పద వ్యాఖ్యలతో ప్రజలను రెచ్చగొట్టలేదని, మోడీని కాంగ్రెస్ దూషించేకొద్దీప్రజల మద్దతు పెరుగుతుందన్నారు. ప్రజాసమస్యలు లేకపోవడంతో కాంగ్రెస్ బాధపడుతోంది. గత తొమ్మిదేళ్లుగాప్రధాని మోడీ భారతదేశాన్ని గర్వించేస్థాయిలో నిలబెట్టారు. దేశాభివృద్ధి కోసం పనిచేశారు.

Also Read: రష్యా క్షిపణిదాడిలో 16మంది మృతి

మౌలిక వసతులను పటిష్ఠం చేశారు. ప్రపంచవ్యాప్తంగా మోడీ ఏ దేశానికి వెళ్లినా మోడీ నినాదాలతో స్వాగతం పలుకుతున్నారని షా అన్నారు. ధార్వాడ్ జిల్లాలోని నిర్వహించిన బహిరంగ సభలో అమిత్‌షా మాట్లాడుతూ కాంగ్రెస్ అధ్యక్షుడు మా నేత మోడీని అంటున్నారు. మోడీ సమాధి కడతామని కాంగ్రెస్ నినదిస్తోంది. సోనియాగాంధీ మృత్యువ్యాపారి అంటారు. ప్రియాంకగాంధీ అంటే ఖర్గే విషనాగు అంటారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్‌నేతలకు మతిభ్రమించినట్లు స్పష్ట చేస్తున్నాయి. మోడీని ఎంతతిట్టినా వికసిస్తుందని షా అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News