Home తాజా వార్తలు రామప్ప ప్రపంచవ్యాప్తంగా వెలగాలి

రామప్ప ప్రపంచవ్యాప్తంగా వెలగాలి

Union Minister Kishan Reddy Visits Ramappa Temple

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

మన తెలంగాణ/వెంకటాపూర్/ములుగు ప్రతినిధి : కాకతీయ కళాసంపద ప్రాచుర్యాన్ని ప్రపంచ వ్యాప్తంగా విస్తరించేందుకు కృషి చేస్తామని కేంద్ర పర్యాటక, సాంసృతిశాఖ ఈశాన్యాభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. వెంకటాపూర్ మండలంలోని రామప్ప దేవాలయం యునెస్కో గుర్తింపు పొందిన నేపధ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర పర్యాటక మంత్రి వి.శ్రీనివాస్‌రెడ్డితో కలిసి రామప్ప ఆలయాన్ని గురువారం సందర్శించారు. ముందుగా రామలింగేశ్వరస్వామిని దర్శించుకొని ఆశీర్వచనాలు అందుకున్నారు. అనంతరం సభ ప్రాంగణానికి చేరుకుని జ్యోతి ప్రజ్వలన మరియు శిలాఫలక ఆవిష్కరణ చేసి మాట్లాడారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకతీయుల శిల్పకళా నైపున్యానికి నిదర్శనమైన రామప్పను మరింత అభివృద్ధి చేయాలన్నారు. కేంద్రం వారసత్వ కట్టడాలను పరిరక్షించేందుకు కృత నిశ్చయంతో ఉందన్నారు. మోడీ ప్రభుత్వం కళలకు, కళాకండాలను భావితరాలకు అందించేందుకు చర్యలు తీసుకుంటుందన్నారు.

భారత సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమైన ప్రాచీన కట్టడాల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. రామప్ప సుందరీకరణ పనులు త్వరితగతిన పూర్తి చేసి విదేశీ పర్యాటకులను ఆకర్శించే దిశగా ఉండాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆకాంక్షించా రు. ప్రదాని మోడీ కరోనాతో ప్రజలు ప్రాణాలు కోల్పోకుండా 18 సంవత్సరాలపై బడిన వారందరికి ఉచిత వా క్సిన్ ఇస్తూ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచారన్నారు. కేం ద్రం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వైద్యులు, నర్సులు, పార మెడికల్ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. త్వరలో పన్నెండు సంవత్సరాలు నిండిన పిల్లలకు కూడా టీకా ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వరంగల్ ఎయిర్‌పో ర్టు అభివృద్ధి చేసి టూరిజం నుంచి సబ్సిడితో అతి తక్కువ విమాన చార్జీలతో ఈ పర్యాటక ప్రాంతాలను సందర్శించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాలతో రామప్ప టూరిజం అభివృద్ధిపై ప్రత్యేక కార్యచరణ రూపొందింస్తున్నామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అభివృద్ధి సాధిస్తామని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని దేవాలయల అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు.

స్థానిక శాసన సభ్యురాలు సీతక్క మాట్లాడుతూ రామప్ప అభివృద్ధికి ఓ ఐఎఎస్‌చే కమిటీ ఏర్పాటు చేసి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలన్నారు.మంజూరైన గిరిజన యునివర్సిటీ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. గోదావరి పరివాహక ప్రాంతమైన తూపాకులగూడెం, దేవాదుల, ఆన్నారం బ్యారేజ్, బొగత జలపాతాలను కలుపుకుని పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్రం నిధులు విడుదల చేయాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఏస్పీ సంగ్రాం సింగ్ పాటిల్, టూరిజం ఎండి మనోహర్‌రావు, ఇంటాక్ కన్వీనర్ ప్రోఫెసర్ పాండురంగరావు, ఐఎఎస్ న్యూడిల్లీ విద్యావతి, టూరిజం చైర్మన్ శ్రీనివాస్‌గుప్తా, ఎంపిపి బుర్ర రజిత సమ్మయ్యగౌడ్, జెడ్పీటీసీ రుద్రామదేవి అశోక్, సర్పంచ్ డోలి రజిత శ్రీనివాస్ పాల్గొన్నారు.

హరిత టూరిజం హోటల్‌కు ప్రారంభోత్సవం

కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి, రాష్ట్ర ఎక్సైజ్ టూరిజం అండ్ కల్చర్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ ములుగు జిల్లాలోని గిరిజన దేవత గట్టమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గట్టమ్మ దేవాలయం అనుబంధంగా తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన హరిత టూరిజం హటల్‌ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక శానససభ్యురాలు సీతక్క, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.