Home జాతీయ వార్తలు పినరయి విజయన్ రాజీనామా చేయాలని కేంద్రమంత్రి దీక్ష

పినరయి విజయన్ రాజీనామా చేయాలని కేంద్రమంత్రి దీక్ష

Union Minister Muraleedharan Hunger Strikeఢిల్లీ: కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసు వ్యవహారానికి సంబంధించి కేరళ సిఎం పినరయి విజయన్ రాజీనామా చేయాలని కేంద్ర విదేశీ, పార్లమెంట్ వ్యవహారాల సహాయ మంత్రి మురళీధరన్ డిమాండ్ చేశారు. విజయన్ రాజీనామాను డిమాండ్ చేస్తూ మురళీధరన్ ఆదివారం ఒక రోజు నిరాహారదీక్షకు దిగారు. దుబాయ్ నుంచి దౌత్య మార్గంలో బంగారం అక్రమంగా కేరళకు తరలించిన వ్యవహారం దేశంలో సంచలనమైన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితులుగా ఉన్న స్వప్న సురేశ్ తో కేరళ సిఎం విజయన్ కు, ఆయన మాజీ కార్యదర్శి శివశంకర్ కు సంబంధాలు ఉన్నాయని మురళీధరన్ ఆరోపించారు. ఈ క్రమంలోనే సిఎం విజయన్ తన పదవికి రాజీనామా చేయాలని కేంద్ర మంత్రి డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ కేరళలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించగా, బిజెపి శనివారం నుంచి సత్యాగ్రహ దీక్షలు చేస్తోంది. ఈ దీక్షలు 18 రోజుల పాటు జరగనున్నాయి.