ముంబయి: కేంద్ర మంత్రి నారాయణ రాణేకు బెయిల్ మంజూరు అయ్యింది. రూ.15వేల పూచికత్తుతో మహద్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ముఖ్యమంత్రికి స్వాతంత్య్రం వచ్చి ఎన్నేళ్లయిదో కూడా తెలియదని, అలాంటివ్యక్తి చెంప పగలగొట్టాలంటూ నారాయణ రాణే చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారి తీసింది. దీంతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మంత్రి నారాయణ రాణేపై శివసేన కార్యకర్తలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. రాణేపై మహారాష్ట్ర వ్యాప్తంగా నాలుగు ఎఫ్‌ఐఆర్ లు నమోదయ్యాయి. దీంతో రత్నగిరి జిల్లా పర్యటనలో ఉన్న రాణేను మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని మహారాష్ట్ర కోర్టును ఆశ్రయించారు. అయితే, రాణే బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరష్కరించింది. రాణే అదుపులోకి తీసుకున్న పోలీసులు మహద్ కోర్టులో హాజరుపర్చారు. రాణేను 7 రోజులు పోలీస్ కష్టడీకి ఇవ్వాలని కోరారు. ఆరోగ్య సమస్యల వల్ల బెయిల్ ఇవ్వాలని మంత్రి తరఫున న్యాయవాదులు కోర్టును కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు రాణేకు బెయిల్ మంజూరు చేసింది. ఈ నెల 30వ తేదీ, సెప్టెంబర్ 13న మహద్ పోలీస్ స్టేషన్ లో హాజరుకావాలని రాణేను ఆదేశించింది.
Union Minister Narayan Rane gets Bail