Home జాతీయ వార్తలు కశ్మీర్ లోయలో షూటింగ్ లు చేసుకోండి : ప్రహ్లాద్ జోషీ

కశ్మీర్ లోయలో షూటింగ్ లు చేసుకోండి : ప్రహ్లాద్ జోషీ

Pralhad Joshiహైదరాబాద్ : కశ్మీర్ విభజన, ఆర్టికల్ 370 రద్దు తరువాత కశ్మీర్ లోయలో షూటింగ్ లు చేసేందుకు సినీ నిర్మాతలు, దర్శకులు ముందుకొస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అశ్వినీదత్, దర్శకుడు నాగ్ అశ్విన్ లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీతో భేటీ అయ్యారు. జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370ను రద్దు చేశామని, అక్కడ స్వేచ్ఛగా షూటింగ్ లు చేసుకోవచ్చని ప్రహ్లాద్ జోషీ వారికి వివరించారు  దీనికి  వారు సానుకూలంగా స్పందించారు. ప్రహ్లాద్ జోషీ కలిసిన వారిలో తెలంగాణ బిజెపి చీఫ్ కె.లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.
Union Minister Pralhad Joshi Comments On Film Industry