Home జాతీయ వార్తలు ఒబామాకు కేంద్రమంత్రి మేనక గాంధీ లేఖ

ఒబామాకు కేంద్రమంత్రి మేనక గాంధీ లేఖ

Obama-Menaka-Gandhiనాసిక్ : స్పెయిన్‌లో జరుగనున్న బుల్ ఫైటింగ్ ఫెస్ట్ (ఎద్దుల పోటీల వేడుక)కు హాజరుకావొద్దని కేంద్రమంత్రి, జంతు హక్కుల కార్యకర్త మేనకాగాంధీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను కోరారు. ఈ మేరకు ఒబామాకు మేనకాగాంధీ ఓ లేఖ రాశారు.
పర్యటనలో భాగంగా స్పెయిన్‌లోని పంప్‌లోనాకు వెళ్తున్న ఒబామాగారు జంతువులను హింసించే విధంగా కొనసాగుతున్న ఎద్దుల పోటీలను వ్యతిరేకించాలి. బుల్ ఫైట్‌ఫెస్ట్‌లో 48 ఎద్దులు పాల్గొంటున్నాయి. నిర్వాహకులు క్రూరంగా వ్యవహరించడం వల్ల పోటీల్లో పాల్గొనే ఎద్దులకు తీవ్ర గాయాలవడమే కాకుండా ఈ పోటీల్లో పాల్గొంటున్నవారు కూడా దెబ్బలు తగిలించుకుంటారని తెలిపారు. జంతువుల స్వేచ్ఛను హరించే ఇలాంటి క్రీడలను తీవ్రంగా పరిగణించి వ్యతిరేకించాల్సిన అవసరముందని ఆమె లేఖలో ఒబామాకు విజ్ఞప్తి చేశారు.