Thursday, March 28, 2024

సోనూసూద్‌కు ఐక్యరాజ్యసమితి అవార్డు..

- Advertisement -
- Advertisement -

United Nations Special Award to Sonu Sood

ముంబయి: బాలీవుడ్ నటుడు సోనూసూద్ ప్రతిష్ఠాత్మక ఐక్యరాజ్య సమితి అవార్డును అందుకున్నారు. సోనూసూద్‌ను ఎస్‌డిజి స్పెషల్ హ్యూమెనిటేరియన్ యాక్షన్ అవార్డుకు యునైటెడ్ నేషన్స్ డెవెలప్‌మెంట్ ప్రోగ్రామ్(యుఎన్‌డిపి) ఎంపిక చేసింది. కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్ వల్ల దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులు, విద్యార్థులకు సహాయమందించినందుకు సోనూసూద్‌ను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. సోమవారం సోనూసూద్‌కు ఈ అవార్డును వర్చువల్ కార్యక్రమం ద్వారా అందించారు. ఈ సందర్భంగా సోనూసూద్ మాట్లాడుతూ.. ‘నా దేశ ప్రజలకు చేయగలిగిన కొద్దిపాటి సాయం చేశాను. అందుకు తానేమీ ఆశించలేదు. అయితే, యుఎన్ తనను గుర్తించి అవార్డు ఇవ్వడం సంతోషం కలిగిస్తోంది’ అన్నారు. యుఎన్‌డిపి సుస్థిర అభివృద్ధి లక్షాలు(ఎస్‌డిజి) 2030 కోసం తన పూర్తి సహకారం ఉంటుందని సోనూసూద్ తెలిపారు.

United Nations Special Award to Sonu Sood

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News