Home ఆఫ్ బీట్ వీడియోలు బాబు బాగా బిజి.. విమానంలోనే కానిచ్చేశాడు…!(వీడియో)

బాబు బాగా బిజి.. విమానంలోనే కానిచ్చేశాడు…!(వీడియో)

Passenger shaves on Flightమన చుట్టు ఉన్నవాళ్లలో కొందరు చేసే పనులు విచిత్రంగా అనిపించిన చేసేవారికి మాత్రం అవి కరెక్ట్ గానే అనిపిస్తాయి. తాము అనుకుంది, తమకు నచ్చింది నలుగురిలో చేయడానికి కూడా వెనుకాడరు. అలాంటి వారి ప్రవర్తన కూసింత విచిత్రంగా అనిపించడం సహజం. తాజాగా యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో ఇలానే ఓ వ్యక్తి తనకు నచ్చినట్టు ప్రవర్తించాడు. బిజినెస్ క్లాస్ విమానంలో ప్రయాణిస్తున్న సదరు ప్రయాణికుడు తాను కుర్చున్న చోటనే తన బ్యాగులోంచి ట్రిమ్మర్ తీసి ఎంచక్క తన నెత్తిని షేవింగ్ చేయడం ప్రారంభించాడు. అది చూసిన తోటి ప్రయాణికులకు ఈయన ఏంటి ఇలా చేస్తున్నడంటూ చెవులు కొరుక్కున్నారు. అయినా మనోడికి అవి ఏం పట్టలేదు.. తన పని తాను కానిస్తునే పోయాడు. అంతేందుకు విమాన సిబ్బంది కూడా అతడిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. మనోడి వింత పనిని తోటి ప్రయాణికుల్లో ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. అంతే… ఆ వీడియో కాస్తా వైరల్ అయింది. పోస్ట్ చేసిన గంటల వ్యవధిలోనే ఈ వీడియోకు వందలాది కామెంట్లు వచ్చి పడ్డాయి. వీడియోపై నెటిజన్లు హాస్యభరిత కామెంట్లతో నవ్వులు పూయించారు. ‘మనుషులను అర్థం చేసుకుంటున్న కొద్దీ.. నేను నా కుక్కను మరింత ప్రేమిస్తున్నా’, ‘బాబు బాగా బిజి అనుకుంటా.. అన్నీ విమానంలోనే కానిచ్చేస్తున్నాడు’, ‘విమాన సిబ్బంది చూసి కూడా పట్టించుకోవడం లేదు.. బహుశా షేవింగ్ అయిపోయాక టవల్ ఏమైనా ఇస్తారేమో’ అంటూ నెటిజన్లు చమత్కరిస్తున్నారు.

United Passenger shaves his Bald Head on Flight