Thursday, November 7, 2024

లిబర్టీ విగ్రహంకన్నా ఐక్యతా విగ్రహానికే పర్యాటకులు అధికం: ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

 Unity statue attracts more tourists than Statue of Liberty: PM Modi

 

అహ్మదాబాద్: అమెరికాలోని లిబర్టీ విగ్రహంకన్నా గుజరాత్‌లోని ఐక్యతా విగ్రహం ఎక్కువమంది పర్యాటకులను ఆకర్షిస్తుందని ప్రధాని మోడీ అన్నారు. రెండేళ్ల క్రితం ఆవిష్కరించిన ఐక్యతా విగ్రహాన్ని ఇప్పటికే 50 లక్షలమంది పర్యాటకులు సందర్శించారని ప్రధాని తెలిపారు. ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశంలోని వివిధ నగరాల నుంచి కెవాడియాకు 8 రైళ్లను ప్రధాని ప్రారంభించారు. 2018 అక్టోబర్‌లో సర్దార్ పటేల్ 143వ జన్మ దినోత్సవం సందర్భంగా కెవాడియాలో ఐక్యతా విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించారు. రైళ్ల అనుసంధానంతో కెవాడియాకు రోజూ లక్షమందికిపైగా వస్తారని ఓ సర్వేలో వెల్లడైనట్టు ప్రధాని తెలిపారు. దాంతో, ఆ ప్రాంతంలోని వారికి కొత్తగా ఉద్యోగాలు, ఉపాధి లభిస్తాయని ఆయన తెలిపారు. ఈ రైలు మార్గాల్లో ప్రయాణించేవారు పలు ఆధ్యాత్మిక కేంద్రాలను కూడా సందర్శించే వీలుంటుందని ప్రధాని తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News