Thursday, April 25, 2024

యాదాద్రి అండాళ్ అమ్మవారికి వైభవంగా ఊంజల్ సేవ

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/యాదాద్రి : శ్రీ లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రంలో అండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవల పూజలను అర్చకులు వైభవంగా నిర్వహించారు. యాదాద్రిలో శుక్రవారం అమ్మవారికి ప్రీతికరమైన రోజు కావడంతో సాయంత్రం ఆలయం మండపంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ఊంజల్ సేవ మహోత్సవాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున 3.30 గంటలకు ఆలయాన్ని తెరచిన అర్చకులు సుప్రభాత, అర్చన, అభిషేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శనాలు కల్పించారు. ఈ మహోత్సవ వేడుకలలో భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకొని తమ మొక్కుబడులను చెల్లించుకున్నారు.

Unjal Seva to Goddess Yadadri Aandal in glory

సాయంత్రము అమ్మవారికి ప్రత్యేక అలంకరణ గావించిన అర్చకులు మేళతాలముల మద్య అమ్మవారి సేవను ఆలయ పూరివీదులలో ఊరేగించగా భక్తజనులు అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీవారి ఆలయంలో జరుగు నిత్యపూజల కైంకర్యంలో భక్తులు పాల్గొని తమ మెక్కుబడలు చెల్లించుకున్నారు. కొండపైన కోలువు దీరిన శ్రీపర్వతవర్ధిని రామలింగేశ్వర స్వామి శివాలయంలో భక్తులు శివ దర్శనము చేసుకున్నారు. శ్రీవారి అనుబంధ ఆలయమైన శ్రీ పాత లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో భక్తులు దర్శించుకొని పూజలు నిర్వహించారు.

శ్రీవారి నిత్యరాబడి…

శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం యాదాద్రి క్షేత్రంలో స్వామివారి ఆలయం నిత్యరాబడి భాగంగా శుక్రవారం రోజున 19 లక్షల 60 వేల 679 రూపాయలు అనుభంద ఆలయమైన పాతగుట్ట దేవాలయం, వివిధ శాఖల నుండి స్వామివారి నిత్యరాబడి సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News