Friday, April 26, 2024

అంబర్‌పేటలో గుర్తుతెలియని వ్యక్తి హత్య..

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: గుర్తుతెలియని వ్యక్తిని బండరాయితో కొట్టి చంపిన సంఘటన నగరంలోని అంబర్‌పేటలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. అంబర్‌పేట పిఎస్ పరిధిలోని మక్రమ్ హోటల్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తిని బండరాళ్లతో కొట్టి చంపారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు. మృతుడిని కొట్టి చంపినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు అంబర్‌పేట పోలీసులు తెలిపారు. స్థానికంగా ఉన్న సిసి కెమెరాలను పరిశీలిస్తున్నారు. వాటి ఆధారంగా ఎవరు హత్య చేశారో తెలుసుకోనున్నట్లు పోలీసులు తెలిపారు.

Unknown Man found murdered in Amberpet

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News