Home తాజా వార్తలు అనసూయపై అసభ్య పోస్టులు…

అనసూయపై అసభ్య పోస్టులు…

 

మనతెలంగాణ/హైదరాబాద్‌: గుర్తుతెలియని పోకిరిలు యాంకర్ అనసూయ భరద్వాజ్ పేరుతో అసభ్యకర వ్యాఖ్యలు చేయడంతో ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రోగ్రెసివ్ యూత్ నాయకులు సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. యాంకర్ అనసూయపై అశ్లీల, అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో కోరారు. అయితే ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వ్యక్తులను గుర్తించేపనిలో పడ్డారు. ఇటవల కాలంలో సోషల్ మీడియాలో సెలబ్రెటీలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని అరెస్టు చేసి జైలుకు తరలించామని, సాంకేతిక పరిజానంతో నిందితులు తప్పించుకోలేరని, వారిని అనతికాలంలో అరెస్టు చేసి కేసులు నమోదు చేస్తామని సైబర్ క్రైం పోలీసులు మీడియాకు తెలిపారు.

Unknown persons bold comments on anchor Anasuya