Tuesday, April 23, 2024

మోహన్‌బాబు ఇంటి దగ్గర హల్‌చల్ చేసిన వ్యక్తులు అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Unknown persons Warned to Actor Mohan Babu

హైదరాబాద్: హైదరాబాద్‌లోని పహాడీషరీఫ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని జల్‌పల్లిలో సినీ నటుడు మోహన్‌బాబు ఫాంహౌస్‌లోని ఇంట్లోకి శనివారం రాత్రి ఇన్నోవా కారుతో దూసుకెళ్లిన నలుగురు వ్యక్తుల్లో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. సిసిటివి దృశ్యాలు, కారు నంబరు ఆధారంగా నిందితులను పట్టుకున్నట్లు పోలీసులు చెప్పారు. నిందితులంతా మైలార్‌దేవ్‌పల్లి దుర్గానగర్‌కు చెందిన యువకులుగా పోలీసులు గుర్తించారు. నిందితుల కాల్‌డేటాను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. కాగా, నిన్న రాత్రి మోహన్‌బాబు ఫాంహౌస్‌లోని ఇంట్లోకి దూసుకెళ్లిన ఆ నలుగురు యువకులు ‘మిమ్మల్ని వదలం’ అంటూ హెచ్చరించిన విషయం తెలిసిందే. దీంతో మోహన్‌బాబు కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. ఈ కేసులో అన్ని కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Unknown persons Warned to Actor Mohan Babu

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News