Thursday, March 28, 2024

అశ్వాపురం మండలంలో కిడ్నాప్ కలకలం..

- Advertisement -
- Advertisement -

Unknown try to kidnap a girl in Aswapuram

ఖమ్మం: జిల్లాలోని అశ్వాపురం మండలంలో కిడ్నాప్ కలకలం రేపింది. మంగళవారం మండల పరిధిలోని ఆమెర్ద కాలనీలో రోడ్డు మీద నిలబడి ఉన్న 10 సంవత్సరాల పాపను కొందరు దుండగలు కారులోకి బలవంతంగా ఎక్కించి కిడ్నాప్ పాల్పడ్డారు. అయితే, పాప బిగ్గరగా అరిచి, కారు డోర్ తీసుకొని కిందకు దూకింది. దీన్ని గమనించిన గ్రామస్తులు పాపను రక్షించి దుండగలను పట్టుకునేందుకు ప్రయత్నించారు. దీంతో దుండగలు పాపను వదిలేసి కారులో పారిపోయారు. అనంతరం పాపతోపాటు గ్రామస్తులు పోలీసులకు ఫిర్యదు చేశారు. దుండగులు బ్లాక్ కలర్ కారులో వచ్చి కిడ్నాప్ కు యత్నించారని,  కారులో మారణాయుధాలు ఉన్నట్లు పాప పేర్కొంది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Unknown try to kidnap a girl in Aswapuram

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News