Home తాజా వార్తలు హత్యకు గురైన మహిళను గుర్తించిన పోలీసులు

హత్యకు గురైన మహిళను గుర్తించిన పోలీసులు

woman dead body హైదరాబాద్: పేట్‌బషీరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణ హత్యకు గురైన మహిళను పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గురువారం కొంపల్లి ప్లై ఓవర్ బ్రిడ్జి సమీపంలో ఓ వ్యవసాయ భూమిలో గుర్తుతెలియని మహిళ మృతదేహాన్ని స్థానికుల సమాచారంతో పోలీసులు గుర్తించారు. బండరాళ్లతో మోది చంపినట్లుగా పోలీసులు నిర్ధారించారు. స్థానికులు ఎవరూ కూడా మృతురాలిని గుర్తించకపోవడంతో గుర్తుతెలియని మహిళగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అయితే మృతురాలు జగద్గిరిగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలోని లెనిన్‌నగర్‌కు చెందిన సీతారామయ్య కుమార్తె దొనబోయిన దుర్గ(28)గా గుర్తించారు.

గతంలో ఈమెకు శ్రీనివాస్‌రావు అనే వ్యక్తితో వివాహం జరిగింది. వీరికి ఓ కూతురు ఉంది. ప్రస్తుతం 9వ తరగతి చదువుతుంది. కాగా మూడు సంవత్సరాల క్రితం భార్యభర్తలిద్దరు విడిపోయారు. అప్పటి నుంచి దుర్గ తన తల్లిదండ్రులతో పాటే లెనిన్‌నగర్‌లో ఉంటుంది. అయితే దుర్గా ఎవరితో బయటకు వెళ్లింది, ఎవరూ హత్య చేసి ఉంటారనే కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు.