Sunday, March 26, 2023

అపర భగీరథుడు కెసిఆర్

- Advertisement -

mission

*22వేల గ్రామాలకు తాగునీరు అందించే దుకు కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం
*మిషన్ భగీరథ మోటర్ల ట్రాయల్ రన్‌ను ప్రారంభించిన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లికృష్ణారావు

మన తెలంగాణ/కొల్లాపూర్:మండల పరిధిలోని ఎల్లూరు గ్రామ పంచాయతీ అవరణలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ పనులు పూర్తి కావడానికి దగ్గర పడటంతో శనివారం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లికృష్ణారావు మిషన్ భగీరథ మోటర్ల ట్రాయల్ రన్‌ను ప్రారంభించారు.ఒకటి సింగో టం పైపు వెళ్ళు మోటర్ కాగా, రెండవది గౌరీదేవిపల్లి వెళ్ళు పైపులైన్.అనంతరం మంత్రి అధికారులతో కలిసి డ్రావాటర్ సంపును పరిశీలించారు.ట్రాయల్ రన్ విజయవంతం కావడంతో మంత్రి జూపల్లి అక్కడే విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, ఆనాడు భగీరథుడు ఆకాశంనుండి గంగను భూమిపైకి తెస్తే ఈనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అపర భగీరథుడిగా ప్రతి గ్రామానికి,ఇంటింటికి తాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నారని అన్నారు.ఎవరు ఉహించని విదంగా, దేశంలో ఎక్కడ లేని విదంగా మిషన్ భగీరథ పనుల చేపట్టారని గుర్తు చేశారు.ఎన్నికలలో హామీలు ఇవ్వకుండానే ప్రణాళిక చెప్పకుండా నిండు శాసన సభలో 2019 ఏప్రిల్‌లో తాగునీరు ఇస్తానని ప్రకటించారని వివరించారు.కృష్ణా, గోదావరి నది ద్వారా రాష్ట్రంలో 22వేల గ్రామాలకు ప్రతి ఒక్కరికి వంద లీటర్ల చోప్పున తాగునీరు అందిస్తున్నట్లు ఆయన పేర్కోన్నారు.నాడు శానన సభలో సియం కేసిఆర్ మిషన్ భగీరథ పథకం ప్రకటించినప్పుడు అందరం అశ్చర్య వ్యక్తం చేశామని, కాని ఈరోజు 2019 ఏప్రిల్‌కు సంవత్సరం ముందే ఈనెల చివరకు తాగునీరు ఇచ్చేందుకు ట్రాయల్న్ చేస్తున్నమని ఇది చిన్న విషయం కాదన్నారు.3సంవత్సరాలలో రెండు లక్షల కిలోమీటర్ల దూరం పైపులైన్ వేసినట్లు ఆయన వివరించారు.రాష్ట్రంలో ఎక్కడ పోయిన మంచినీటి ఘోష ఉండేదని, వందల మీటర్లు బోర్లు వెసిన నీరు వచ్చేదికాదని ఆయన గుర్తు చేశారు. నల్గోండ జిల్లాలో ప్లోరైడ్ బాధితులకు ఈనీరుతో కష్టాలు తీరుతాయన్నారు. 70సంవత్సరాలలో దేశంలో ఏరాష్ట్రం అమలు చేయాని ఈపథకం తెలంగాణ ప్రభుత్వం చేసి చూపిందన్నారు.భారతదేశానికి ఆదర్శంగా తెలంగాణ రాష్ట్ర నిలిచిందన్నారు.24గంటలు విద్యుత్, రైతులకు సాగునీరు, నిరూపేదలకు పించన్లు,ఇలా అనేక పథకాలతో ముందున్నామని అన్నారు.దేశ ప్రధాని నరేంద్రమోడీ బిజేపి పాలిత రాష్ట్రాల సియంను తెలంగాణలో అమలు అవుతున్న పథకాలను చేసి రమ్మని సూచించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.ఇక మంచినీటికి కటకటలు శాశ్వతంగా దూరం అవుతాయని ఆయన తెలిపారు. అనంతరం మండల పరిధిలోని సింగోటం శ్రీలక్ష్మీదేవమ్మ గుట్ట దగ్గర పంపు హౌజ్‌ను పరిశీలించి ఇక్కడ రన్ చేసిన నీటిని అక్కడ ఒపన్  చేసి మంత్రి చూశారు.ఇంక పెండింగ్‌లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.ఈకార్యక్రమంలో ఎంఎల్‌సి కసిరెడ్డినారాయణరెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ బండారి భాస్కర్, మాజీ ఎంపి మంద జగన్నాథం,ఎంపిపి చిన్న నిరంజన్‌రావు, పెద్దకొత్తపల్లి ఎంపిపి వెంకటేశ్వర్‌రావు, జడ్పీటీసిలు హన్మంత్ నాయక్, వెంకటయ్య, వాటర్ గ్రీడ్ ఎస్‌ఇ చిన్నారెడ్డి, ఇఇ జయబాయి, డిఇ రాజు, రమేష్, ఎఇ నవీన్‌కుమార్,ముక్కిడిగుండం సర్పంచ్ శారద లోకేష్, ఎల్లూరు ఎంపిటి సి స్వామి, నార్లాపూర్ ఎంపిటిసి రామన్‌గౌడ్, మాజీ ఎంపిపి నరేందర్‌రెడ్డి, మాజీ సర్పంచులు చంద్రశేఖర్‌శేట్టి,శేఖర్‌రెడ్డి, బాలస్వామి, బోరెల్లి మహేష్,రెడ్డి సత్యం,అన్వర్, సంపంగి నరసింహ్మ, పస్పుల నరసింహ్మ,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News