Friday, April 26, 2024

వేలాది జీవితాల్లో ‘స్మైల్’

- Advertisement -
- Advertisement -

 కెటిఆర్ గిఫ్ట్ ఏ స్మైల్ పిలుపునకు వెల్లువెత్తిన దాతలు
మూడేళ్లలో 120 అంబులెన్స్‌లు, వికలాంగులకు 1100 వాహనాలు
విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేత, స్కూళ్ల దత్తత కార్యక్రమాలు

మన తెలంగాణ/హైదరాబాద్ : టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ పుట్టిన రోజు సందర్భంగా నిర్వహిస్తున్న ‘గిఫ్ట్ ఏ స్మైల్’ పథకానికి అనూహ్య స్పందన లభిస్తోంది. ప్రతి సంవత్సరం ఈ పథకం కింద విలువైన వస్తువులను ఉచితంగా పంపిణీ చేసేందుకు దాతలు పెద్దఎత్తున ముందుకు వస్తున్నారు. వీటి తో రాష్ట్రంలోని వికలాంగులకు, విద్యార్ధిని, విదార్దులకు, రోగులను ఆదుకుంటున్నారు. మూడేళ్ల్ల్ల్ల క్రితం కెటిఆర్ గిఫ్ట్ ఏ స్మైల్ పథకానికి శ్రీకారం చుట్టారు. తన పుట్టిన రోజు సందర్భంగా ఆరు అంబులెన్స్‌లను విరాళంగా ఇస్తున్నట్లు అప్పట్లో కెటిఆర్ పేర్కొన్నారు. దానికి రాష్ట్ర మంత్రులు, టిఆర్‌ఎస్ ఎంపిలు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యు లు కూడా పెద్దఎత్తున స్పందించారు. వారు ముందుకు వచ్చి అంబులైన్స్‌లను విరాళం ఇవ్వడంతో వాటి సంఖ్య ప్రస్తుతం 120 చేరడం ఆనందంగా ఉం దని ఈ సందర్భంగా కెటిఆర్ వ్యాఖ్యానించారు.

అలాగే రెండో సంవత్సరం లో తాను వ్యక్తిగతంగా 200కు పైగా కస్టమ్ మేడ్ వాహనాలను వికలాంగుల కోసం విరాళంగా ఇవ్వగా….మళ్లీ ఎంపిలు, శాసనసభ్యులు ముందుకు వచ్చి వికలాంగుల వాహనాలను పెద్దఎత్తున విరాళం అందజేశారు. దీంతో వీటి సంఖ్య ప్రస్తుతం 1100లకు చేరిందన్నారు. ప్రస్తుతం ఈ సంవత్సరం పుట్టిన రోజు సందర్భంగా తన వ్యక్తిగత హోదాలో సిరిసిల్ల జిల్లాలోని ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు (11, 12వ తరగతి) సాఫ్ట్‌వేర్ కోచింగ్ మెటీరియల్‌తో కూడిన బివైజెయు పవర్డ్ టాబ్లెట్‌లను పంపిణీ చేయనున్నట్లు మంత్రి కెటిఆర్ వెల్లడించారు. ఇది పోటీ పరీక్షలకు మెరుగైన శిక్షణ పొందేందుకు అదనపు మెటీరియల్‌తో విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఈ మేరకు ఆదివారం మంత్రి కెటిఆర్ ఒక ట్వీట్ చేశారు. ప్రస్తుతం తాను 46వ సంవత్సరంలోకి అడుగుపెటినట్లు ఆయన వెల్లడించారు. తన పుట్టిన రోజు సందర్భంగా మంత్రులు, ఎంపిలు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు పెద్దఎత్తున ముందుకు వచ్చి అనేక సేవా కార్యక్రమాలు చేపడుతుండడం సంతోషంగా ఉందన్నారు. తన పట్ల వారు కురిపిస్తున్న ఆప్యాయతలకు తాను ఎప్పటికీ కృతజ్ఞుడను అని వ్యాఖ్యానించారు. ‘గిఫ్ట్ ఎ స్మైల్’ నిజంగా తనకు వ్యక్తిగతంగా ఎంతో సంతృప్తి నిస్తోందన్నారు. అలాగే గర్వంగా కూడా ఉందని కెటిఆర్ పేర్కొన్నారు.

ముందుకు వచ్చిన ప్రజాప్రతినిధులు

రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల కురిసిన వర్షాల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకోవాలని కెటిఆర్ తన అనుచరులు, శ్రేయోభిలాషులను కోరారు. ఆయన పిలుపు మేరకు పలువురు ప్రజాప్రతినిధులు పెద్దఎత్తున ముందుకు వచ్చి పలు సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. గిఫ్ట్ ఎ స్త్మ్రల్ చొరవను స్ఫూర్తిగా తీసుకుని పలువురు నాయకులు తమ గ్రామాల సంక్షేమం కోసం పెద్ద ఎత్తున పనులు చేపట్టారు. అవసరమైన సరకులు, ఉత్పత్తులను పంపిణీ చేశారు. కాగా ఎంఎల్‌సి శంభీపూర్ రాజు కుత్భుల్లాపూర్ నియోజవకర్గం పరిఈధిలోని శాపూర్‌నగర్ ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకోగా నాగర్‌కర్నూల్ శాసనసభ్యుడు మర్రి జనార్దన్ రెడ్డి మూడు ప్రభుత్వ పాఠశాలల అభ్యున్నతికి రూ. 8 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. కాగా శాసనసభ్యులు గాంధీ ఆరెకపూడి, చల్లా ధర్మారెడ్డి తమ క్యాంపు కార్యాలయాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించారు.

గతంలో రామవరం గ్రామాన్ని దత్తత తీసుకున్న ఎంఎల్‌సి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గిఫ్ట్ ఎ స్త్మ్రల్ కింద కొత్త అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర స్టేట్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ క్రిశాంక్ రసూల్‌పురాలో పాఠశాల విద్యార్థులకు రెయిన్‌కోట్‌లను పంపిణీ చేశారు మరియు కంటోన్మెంట్‌లోని మారేడ్‌పల్లిలోని ప్రత్యేక సామర్థ్యం గల పిల్లల హాస్టల్‌లో పిల్లలకు పాఠశాల యూనిఫాంలను కూడా విరాళంగా అందజేశారు. రాష్ట్ర స్టేట్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వై సతీష్ రెడ్డి గిఫ్ట్ ఎ స్త్మ్రల్ ఇనిషియేటివ్ కింద ఇద్దరు వికలాంగులకు కస్టమ్ మేడ్ ‘ఈ-వెహికల్స్’ను అందజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News