Tuesday, March 21, 2023

న్యాయం జరిగే వరకు దళిత సంఘాలు ఏకమై పోరాడాలి

- Advertisement -

cpi

మన తెలంగాణ /కాగజ్‌నగర్: బెజ్జూర్ మండలం మర్తిడి గ్రామంలో దళిత మహిళ సేవంతపై కిరోసిన్ పోసి నిప్పంటించి హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, వారి కుటుంబానికి న్యాయం చేయాలని సిపిఐ సిర్పూర్ నియోజక వర్గ కార్యదర్శి అంబాల ఓదేలు అన్నారు. ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దళిత మహిళ కుటుంబానికి న్యాయం జరిగే వరకు దళిత సంఘా లు ఏకమై పోరాడాలన్నారు. ఈసందర్భంగా ఈ నెల 7న బుధవారం ఉదయం 11గంటలకు సంతోష్ ఫంక్షన్‌హాల్‌లో ఏర్పాటు చేసే సమావేశానికి అన్ని , రాజకీయ, దళిత సంఘాలన నాయకులు పాల్గొని దళిత మహిళ సేవంతను హత్య చేసిన హంతకులను కఠినంగా శిక్షించటమే కాకుండా ప్రభుత్వం ఆమె కుటుంబాన్ని ఆర్థికంగా అన్ని విధాలుగా అదుకొనుటకు చేపట్టాల్సిన కార్యక్రమము రూపొందించుటకు ఈ రౌండ్ టేండ్ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ సమావేశానికి సిపిఐ కార్యదర్శి వర్గ సభ్యులు , మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్, పాల్గొంటారన్నారు. దళిత మహిళ సేవంత పై జనవరి 30 అర్థరాత్రి నిద్రిస్తున్న ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించి అత్యం కిరాతకంగా హత్య చేశారని, అప్పు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమని అడగమే నేరమా .. అని, అమె హత్య చేసిన టీఆర్‌ఎస్ పార్టి మండల కోఅప్షన్ సభ్యులు బషరత్‌ఖాన్, సాలుబాయి , అమె కుమారుడు కామెర సాయిలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంటన దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కన్వీనర్ చున్కర్ దామోదర్ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో దళితులపై హత్యలు జరుగుతున్నాయి
.. టీడీపీ జిల్లా అధ్యక్షులు గుళ్ళపల్లి ఆనంద్
బెజ్జూర్ మండలం మర్తిడి గ్రామంలో దళిత మహిళా దుర్గం శ్రవంతపై కిరోసిన్ పోసి నిప్పంటించి అతికిరాతంగా హత్యకు పాల్పడిన అధికార పార్టీ మండల కోఆప్షన్ సభ్యులు బషరాత్‌ఖాన్ తో పాటు మరో ఇద్దరు నిందులను వెంటనే అరెస్టు చేయాలని టీడీపీ జిల్లా అధ్యక్షులు గుళ్లపల్లి ఆనంద్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన విలేకుల సమావేశంలో మాట్లాడుతూ మృతురాలు సిర్పూర్ మెజిస్టేట్ ముందు వాంగ్ములం ఇచ్చినప్పటికీ కేసు నమోదు చేసిన పోలీసులు నిందుతులను ఎందుకు అరెస్టు చేయడం లేదని, విచారణ పేరుతో కేసును తప్పదారి పట్టించేందుకు చూస్తున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం వస్తే మాకు మంచి రోజులు వస్తాయని ఆశపడ్డ బడుగు,బలహీన వర్గాల ప్రజలు అన్యాయం జరుగుతుందని, రాక్షసపాలన జరుగుతుంటే చూసిచలించిపోతున్నారన్నారు. మృతురాలి కుటుంబానికి అన్యాయం చేయాలని, లేనట్లయితే టీడీపీ పార్టీ పోరాడుతుందన్నారు. ఈ సమావేశం టీడీపీ ప్రధాన కార్యదర్శి ఆత్మరాం, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు మాదవ్, నాయకులు గులాబ్‌రామ్, అంజయ్య పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles