Home జాతీయ వార్తలు సుధీర్ఘ నిరీక్షణ తర్వాత రామాలయ నిర్మాణం : యుపి సిఎం యోగి

సుధీర్ఘ నిరీక్షణ తర్వాత రామాలయ నిర్మాణం : యుపి సిఎం యోగి

UP CM Yogi Adityanath Comments On Ram Templeల‌క్నో: సుధీర్ఘ నిరీక్షణ తర్వాత అయోధ్యలో రామాలయ నిర్మాణం జరుగుతుందని యుపి సిఎం యోగి ఆదిత్య నాథ్ తెలిపారు. బుధవారం ఉదయం అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోడీ భూమి పూజ చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో యోగి మాట్లాడారు. 500 ఏళ్ల సంఘర్షణ తరువాత రామాలయం నిర్మించాలన్న భారత ప్రజల కల బుధవారంతో నెరవేరిందని ఆయన పేర్కొన్నారు రామాలయం కోసం ఎంతో మంది త్యాగాలు చేశారని, వారి త్యాగాలకు ఫలితం వచ్చిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. చట్టపరిధిలో ప్రజాస్వామ్య బద్ధంగా రామాలయాన్ని నిర్మించుకుంటున్నామని ఆయన వెల్లడించారు. దేశ ప్రజల సంక్షేమం కోసం ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని ఆయన కొనియారు. అయోధ్యలో సాంస్కృతిక పరిరక్షణకు అందరూ కృషి చేయాలని యోగి పేర్కొన్నారు.