Saturday, April 20, 2024

మాస్క్ ధరించలేదని అతిగా ప్రవర్తించిన పోలీసులు సస్పెండ్..

- Advertisement -
- Advertisement -

2 men roll on road

లక్నో: దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలల్లో రోడ్డుపైకి వచ్చే ప్రజలపట్ల కొందరు పోలీసులు అతిగా ప్రవర్తించి తగిన మూల్యం చెల్లించుకుంటున్నారు. తాజాగా ఇద్దరు యుపి పోలీసులు ప్రజల పట్ల అతిగా ప్రవర్తించి సస్పెండ్ కు గురయ్యారు. వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్ లో హపూర్ జిల్లాలో ఇద్దరు వ్యక్తులు ముఖానికి మాస్కులు లేకుండా రోడ్డుపైకి వచ్చారు. ఆ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు పోలీసులు.. మాస్కులు ధరించకుండా రోడ్డుపైకి వచ్చినందుకు వారిని మండుటెండల్లో రోడ్డుపై పడుకోమని చెప్పి అటు ఇటు దొర్లిపించారు. ఎండకు శరీరం కాలుతుండడంతో మధ్యలో దొర్లడం ఆపితే లాఠీలకు పనిచెప్పారు. దీనిని ఓ వ్యక్తి వీడియో తీసి యుపి పోలీసుల ట్వీట్టర్ అకౌంట్ కు ట్యాగ్ చేస్తూ షేర్ చేశాడు. ఈ వీడియోకు స్పందించిన అధికారులు దర్యాప్తుకు ఆదేశించారు. సదరు వ్యక్తుల పట్ల ఇద్దరు పోలీసులు అతిగా ప్రవర్తించినట్లు దర్యాప్తులో తేలడంతో సూపరెండెంట్ ఆఫ్ పోలీస్ వారిని సస్పెండ్ చేశారు.

UP Cop Suspended after 2 men roll on road in Scorching heat

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News