Thursday, March 28, 2024

కరోనా సోకిందని అనుమానంతో బస్సు నుంచి అమ్మాయిని నెట్టేయడంతో…..

- Advertisement -
- Advertisement -

UP girl thrown out from bus over Corona

 

లక్నో: ఢిల్లీ నుంచి షికోహబాద్‌కు బస్సులో 19 ఏళ్ల అమ్మాయి వెళ్తుండగా కరోనా వైరస్ సోకిందనే అనుమానంతో డ్రైవర్, కండక్టర్ కలిసి ఆమెను కిందకు నెట్టేయడంతో 30 నిమిషాల తరువాత ఆ యువతి మృతి చెందిన సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని యమునా ఎక్స్‌ప్రెస్ జాతీయ రహదారిపై జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. అన్షిక యాదవ్ అనే అమ్మాయి తన కుటుంబ సభ్యులతో ఢిల్లీలోని మండ్వాలి ప్రాంతంలో నివసిస్తోంది. అన్షిక తల్లిదండ్రుల స్వస్థలం ఉత్తర ప్రదేశ్‌లోని షికోహబాద్. అన్షిక తన కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీ నుంచి షికోహబాద్‌కు బస్సులో వెళ్తుండగా ఆమెకు కరోనా వచ్చిందనే అనుమానంతో డ్రైవర్, కండక్లర్ ఆమె కప్పుకున్న దుప్పటిని కిందపడేశారు. అనారోగ్యంగా ఉన్నావని దిగిపోవాలని కండక్టర్, డ్రైవర్ ఆమెకు సూచించారు. తన కూతురుకు ఎటువంటి రోగాలు లేవని అన్షిక తల్లి బతిమలాడిన వాళ్లు వినకుండా అందరినీ కిందకు దించేశారు. బస్సు 30 నిమిషాల తరువాత అమ్మాయి చనిపోయింది. స్థానికులు మృతదేహాన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అన్షిక గుండె పోటుతో చనిపోయిందని పోస్టుమార్టమ్ లో తేలిందని ఎస్‌ఎస్‌పి గౌరవ్ గ్రోవర్ తెలిపాడు. సహజ మరణం కింద కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News