Home తాజా వార్తలు గవర్నర్ సంచలన నిర్ణయం..?

గవర్నర్ సంచలన నిర్ణయం..?

ram-naik

లక్నో: ఉత్తరప్రదేశ్ గవర్నర్ రాంనాయక్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వంలో అక్రమాలు జరిగాయని ప్రత్యేకంగా సమాజ్ వాది పార్టీ నేత, మాజీ మంత్రి మహ్మద్ ఆజం ఖాన్ పై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్ కు లేఖ రాశారు. ఆజం ఖాన్ అక్రమాలపై 14అంశాలను ప్రస్తావిస్తూ గవర్నర్ లేఖ రాశారు. అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంత్రి హోదాలో ఉన్న ఆజం ఖాన్ తన అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని తెలిపారు. వక్ఫ్ బోర్డు ఆస్తులను ఆక్రమించుకోవడంతోపాటు ప్రైవేటు యూనివర్శిటీలో తన సొంతానికి అతిథిగృహాన్ని నిర్మించుకున్నారని పేర్కొన్నారు. స్పోర్ట్స్ స్టేడియంకు చెందిన సామాగ్రిని ప్రైవేట్ యూనివర్శిటీ అయిన మహ్మద్ అలీ జౌహార్ వర్శిటీకి అక్రమంగా తరలించుకున్నారుని గవర్నర్ రాంనాయక్ లేఖలో పేర్కొన్నారు. సిఎంకు రాసిన లేఖలో వక్ఫ్ బోర్డు ఆస్తుల ఆక్రమణకు సంబంధించి అధికారులు అందజేసిన 42 పేజీల నివేదికను జతపరిచారు.