Home ఆఫ్ బీట్ వీడియోలు తప్పు చేశాడు.. శిక్ష వేసుకున్నాడు!(వీడియో)

తప్పు చేశాడు.. శిక్ష వేసుకున్నాడు!(వీడియో)

Man Cutts his Fingerలక్నో: ఉత్తరప్రదేశ్ లో గురువారం జరిగిన రెండో దశ పోలింగ్ లో ఓ షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. బీఎస్పీ వీరాభిమాని అయిన ఓ యువకుడు పొరపాటున బిజెపికి ఓటు వేసి పశ్చాతాపంతో తన చేలి వేలును తానే నరుక్కున్నాడు. ఈ సంచలన సంఘటన యుపిలోని బులంద్ షహర్ పార్లమెంట్ పరిధిలోగల అబ్దుల్లాపూర్ హులాసన్ గ్రామంలో జరిగింది. స్థానికంగా నివాసముండే పవన్ కుమార్ అనే వ్యక్తి బీఎస్పీకి వీరాభిమాని. కానీ, నిన్న జరిగిన పోలింగ్ లో పొరపాటున ప్రత్యర్థి బిజెపికి ఓటు వేశాడు. ఎన్నికల్లో ఓటేసేందుకు పోలింగ్‌ కేంద్రానికి వెళ్లిన పవన్ బీఎస్పీ కూటమి అభ్యర్థి యోగేశ్ వర్మకు బదులు పొరపాటున బిజెపి అభ్యర్థి భోలా సింగ్‌ ఓటువేశాడు. దీంతో తనలో తాను మధనపడ్డ పవన్ పశ్చాతాపంగా తన వేలుని తానే నరుక్కున్నాడు. ఈ విషయం కాస్తా ఆ నోట ఈ నోట మీడియాకు చేరింది. దాంతో స్థానిక మీడియా ఆయనను ప్రశ్నించగా… తాను బీఎస్పీకి వేయాలనుకున్న ఓటు పొరపాటున బిజెపికి వేశానని చెప్పాడు. అయితే, ఇలా కమలానికి ఓటు వేయమని మీపై ఏవరైన ఒత్తిడి తెచ్చారా అని ఆయన్ను ప్రశ్నించగా అదేమీ లేదని.. తానే పొరపాటున బిజెపికి వేశానన్నాడు. ఆ తరువాత తాను చేసిన తప్పుకు పశ్చాతాపంగా తన వేలిని తానే కోసుకున్నట్లు చెప్పాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

UP Man Severed his Own Finger for Accidently Voting BJP