Tuesday, April 23, 2024

ఉప్పల్ ప్రాంత అభివృద్దికి నాగోల్ చెత్త ట్రాన్స్‌ఫర్ స్టేషన్ అడ్డంకి

- Advertisement -
- Advertisement -

అధికారుల వైఖరితో లు క్ ఈస్ట్ విధానానికి విఘాతం
ఒకవైపు మూసి మరో వైపు చెత్త ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌తో భరించలేని కంపు
మూత పడుతున్న వాణిజ్య సముదాయాలు
ఇబ్బందులు పడుతున్న స్థానికులు

Uppal area not developed with dumping yard

మన తెలంగాణ/సిటీ బ్యూరో: హైదరాబాద్ నగరం నలు మూలల అభివృద్దే లక్షంగా అనేక చర్యలు చేపట్టింది. దీంతో భాగంగా హైదరాబాద్ తూర్పవైపు సైతం సమగ్రంగా అభివృద్దికి గాను “లుక్ ఈస్ట్‌” విధానాన్ని శ్రీకారం చుట్టింది. దీంతో ఉప్పల్ పరిసర ప్రాంతాలు మొదలు నాగోల్ మూసీ నది వంతెన వరకు శరవేగంగా వాణిజ్య కేంద్రంగా విస్తరించడమే కాకుండా రియల్ ఎసేట్ట్ సైతం పుంజుకుంది. అంతేకాకుండా ప్రభుత్వం సైతం ఉప్పల్ నుంచి మేడిపల్లి వరకు అతిపెద్ద ప్లై ఓవర్ నిర్మించడమే కాకుండా ఉప్పల్ చౌరస్తా వద్ద స్కైవేను సైతం నిర్మిస్తోంది. వీటికి తోడు ప్రజా రవాణా రంగంలో కీలక భూమిక పోషిస్తున్న మెట్రో రైలు కు సంబంధించి ప్రధాన కేంద్రంతో పాటు డిపో కూడా ఇదే ప్రాతంలో ఉంది. అంతా భాగున్నా నాగోల్ మెట్రో ప్టేషన్‌కు అనుకునే చెత్త ట్రాన్స్‌ఫర్ స్టేషన్ ఈ ప్రాంత అభివృద్దిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ట్రాన్స్‌ఫర్ స్టేషన్ నిర్వహణ పట్టించుకోకపోవడంతో భరించలేని కంపు కొడుతోంది. ఇకవైపు మూసీ మరో వైపు చెత్త ట్రాన్స్‌ఫర్ స్టేషన్ నుంచి వెలువడుతున్న దుర్వాసనతో పరిసర ప్రాంతాల వాసులు హడలి పోతున్నారు. నాగోల్ మెట్రో స్టేషన్‌లో ప్రయాణికులతో పాటు ఈ మార్గం గుండా వేళ్లే వాహనదారులు ముక్కులు మూసుకుని వెళ్లే పరిస్థితి నెలకొంది.

నిర్వహణపై దృష్టి సారించని నిర్వహణ సంస్థ:

నాగోల్ మెట్రోస్టేషన్ వద్ద ఉన్న జిహెచ్‌ఎంసి చెత్త ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌కు ఎల్‌బినగర్ జోన్‌లోని నాగోల్ , ఎల్‌బినగర్, సరూర్ నగర్ తదితర సర్కిళ్లలో సేకరించిన చెత్తను స్వచ్చ ఆటోలతో పాటు ఇతర వాహనాల ద్వారా చెత్త ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌కు తీసుకువస్తారు. ఈ చెత్తను ఇక్కడి నుంచి జవహార్‌నగర్ డంపింగ్ యార్డుకు తరలిస్తుంటారు. అయితే ఈ ప్రాంతా అభివృద్ది దృష్యా ప్రభుత్వం ఉప్పల్ పారిశ్రామిక ప్రాంతంలో జిహెచ్‌ఎంసి అత్యాధునిక సాంకేతిక పరికరాలతో కూడిన చెత్త ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌ను నిర్మించింది. నాగోల్ చెత్త ట్రాన్స్‌ఫర్ స్టేషన్ ఎత్తి వేసి ఆ స్థలంలో పార్క్‌ను ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైతే వాణిజ్య అవసరాల కోసం వినియోగించుకోవాలని గతంలోనే ప్రణాళికలను సిద్దం చేసింది. దీంతో ఈ పరిసర ప్రాంతాల వాణిజ్య కేంద్రాలతో పాటు పరిసర ప్రాంతాల్లోని కాలనీలు, బస్తీవాసులు ఆనంత పడ్డారు. అయితే చెత్త ట్రాన్స్‌ఫర్ స్టేషన్ ఎత్తివేయక పోగా నిర్వహణను సైతం గాలికి వదలివేయడంతో సమస్య మరింత త్రీవ రూపం దాల్చింది. ఈ సమస్య కారణంగా అనేక వాణిజ్య సంస్థలు, షాపులు మూతపడుతుండడమే కాకుండా మెట్రో ప్రయాణికుల సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు చెత్త రవాణా సమయంలో వాహనాల నుంచి వ్యర్థాలు రోడ్లపై కారుతుండడంతో ద్విచక్ర వాహనదారులు అదుపు తప్పి తరుచు ప్రమాదాలకు సైతం గురవుతున్నారు.

అధికారుల వైఖరితోనే ఇబ్బందులు:

ఉప్పల్ పరిసర ప్రాంతం అభివృద్దికి ప్రభుత్వ పరంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా జిహెచ్‌ఎంసి అధికారుల వైఖరి కారణంగా ఇబ్బందులు పడాల్సి వస్తుందన్న విమర్షలు వినిపిస్తున్నాయి. ఉప్పల్ పారిశ్రామిక వాడలో నిర్మించిన అత్యాధునిక చెత్త ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌కు ఓ అధికారి రెండు సర్కిళ్ల చెత్తను తప్ప ఇతర ప్రాంతాల నుంచి వచ్చే చెత్తను అనుమతించడంలేదనే అరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో నాగోల్, హయత్‌నగర్, ఎల్‌బినగర్, సరూర్ నగర్ తదితర సర్కిళ్లలో వెలువడుతున్న చెత్తను నాగోల్ మెట్రో స్టేషన్ పక్కనే ఉన్నా చెత్త ట్రాన్స్‌పర్ స్టేషన్‌లో తరలిస్తున్నారు. దీంతో ఇక్కడ పెద్ద ఎత్తున చెత్త నిల్వలు పేరుకుపోవడం, నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో భరించలేనంత దుర్వాసన వస్తోందని విమర్శలు ఉన్నాయి. నాగోల్ చెత్త తరలింపు లోపాయికారి ఒప్పందం కారణంగా ఉప్పల్ కొత్త ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌ను నిర్మించినప్పటికీ ఇంకా నాగోల్ చెత్త కేంద్రాన్ని నిర్వహించడం పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చెత్త నిర్వహణ సంస్థలు (కాంట్రాక్టర్ల), అధికారులు మధ్య ఉన్న లోపాయికారి ఒప్పందం ఇందుకు కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. ఇకనైనా నాగోల్ చెత్త ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌ను ఎత్తివేసి ఈ స్థలంలో పార్క్‌ను నిర్మించి ప్రజలకు ఆరోగ్యంతో పాటు ఆహ్లాదకారాన్ని అందించాలని కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News