Thursday, April 25, 2024

ఉప్పల్ ఎమ్మెల్యేకు తృటిలో తప్పిన ప్రమాదం..

- Advertisement -
- Advertisement -

Uppal MLA Safely escape from Lift Accident

మనతెలంగాణ/హైదరాబాద్: ఆస్పత్రి వార్షికోత్సవానికి హాజరైన ఉప్పల్ ఎమ్మెల్యే లిఫ్టు కూలిన సంఘటన నుంచి తృటిలో తప్పించుకున్న సంఘటన ఉప్పల్‌లో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి ఉప్పల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి వార్షికోత్సవానికి హాజరయ్యాడు. ఆస్పత్రిలో లిఫ్టు ద్వారా బోడుప్పల్ మేయర్ బుచ్చిరెడ్డితో పాటు మిగతా వారితో కలిసి పై అంతస్తుకు వెళ్తుండగా కూలిపోయింది. ఒక్కసారిగి లిఫ్టు కూలడంతో మేయర్ బుచ్చిరెడ్డితోపాటు పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం నుంచి ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి సురక్షితంగా బయపడ్డారు. ఎమ్మెల్యేకు ఎలాంటి గాయలు కాకపోవడంతో ఆస్పత్రి యాజమాన్యం, సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు.

Uppal MLA Safely escape from Lift Accident

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News