Home తాజా వార్తలు ప్రజలకు ఉప్పల శ్రీనివాస్‌గుప్తా సంక్రాంతి శుభాకాంక్షలు

ప్రజలకు ఉప్పల శ్రీనివాస్‌గుప్తా సంక్రాంతి శుభాకాంక్షలు

Uppala Srinivas gupta sankranti wishes the people of telangana

 

హైదరాబాద్: ఎల్బీనగర్‌ నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో శుక్రవారం భోగి పండుగ సంబురాలు అంబరాన్నంటాయి. ఇంటి ముందు రంగవళ్లులు, వీధీ వీధీన భోగిమంటలతో సంక్రాంతి వేడుకలు ఆనందోత్సహల మధ్య జరుపుకున్నారు. తెల్లవారుజామున నుంచే ఎక్కడ ఎక్కడ చూసిన భోగిమంటలతో ఇళ్ల ముందు రంగు రంగుల ముగ్గులు వేస్తూ చిన్న పెద్ద అందరు సందండి చేశారు. ఏడాదంతా సుఖసంతోషాలతో ఉండాలని భోగిమంటలు వేసుకున్నారు. గంగిరెద్దులు విన్యాసాలతో పిల్లలు, పెద్దలు ఆనందంగా గడిపారు. తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్‌గుప్తా నివాసంలో నిన్న భోగిమంటలతో సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇంటర్‌నేషన్‌ల్ వైశ్య ఫేడరేషన్ ప్రధమ మహిళ ఉప్పల స్వప్న, చంద్రశేఖర్, చందా భాగ్య లక్ష్మి, శ్రీనివాస్‌గుప్తా, శ్రీనివాస్, రవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్‌గుప్తా మకర సంక్రాంతి పర్వదినాన రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.

Uppala Srinivas gupta sankranti wishes the people of telangana