Friday, March 29, 2024

ఈశ్వరా.. పరమేశ్వరా.. చూడరా.. ఇటు చూడరా..!

- Advertisement -
- Advertisement -

Uppena Eshwara Parameshwara Special song release

 

వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి జంటగా నటించిన చిత్రం ‘ఉప్పెన’. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమవుతోన్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందిస్తున్నారు. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వం వహించారు. సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. ఈ సినిమాలో విజ‌య్ సేతుప‌తి విల‌న్‌గా నటించారు.  ఫిబ్రవరి 12న ఈ సినిమా విడుదల కానుంది.  తాజాగా ఈ సినిమా నుంచి ‘ఈశ్వరా.. పరమేశ్వరా.. చూడరా.. ఇటు చూడరా..’ అంటూ సాగే ఓ పాటను చిత్రబృందం విడుదల చేసింది. దేవిశ్రీ ప్రసాద్ ఈ పాటను ఆలపించారు. భావోద్వేగంగా సాగే ఈ పాట ప్రస్తుతం నెటిజన్ల హృదయాలను హత్తుకుంటోంది. శనివారం రాత్రి ’ఉప్పెన‘ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక జరిగిన విషయం తెలిసిందే.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News