Friday, April 26, 2024

‘ఉప్పెన’ టీజర్ విడుదల..

- Advertisement -
- Advertisement -

మెగా మేనల్లుడు, సాయిధరమ్ తేజ్ సోదరుడు పంజా వైష్ణవ్ తేజ్ ఉప్పెన మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రి ఇవ్వబోతున్నాడు. నూతన దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కృతిశెట్టి నథానాయికగా తెలుగు తెరకు పరిచయం కాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను మైత్రీమూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, సుకుమార్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా, ఇప్పటికే విడుదల ఈ సినిమా పాటలు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. తాజాగా సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ మూవీ టీజర్‌ను చిత్ర యూనిట్ కొద్దిసేపటి క్రితం సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు.ఈ టీజర్ మెగా అభిమానులతోపాటు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా ఫిబ్రవరిలో విడుదల చేసేందకు చిత్రయూనిట్ సన్నాహలు చేస్తున్నారు.

Uppena Movie Teaser Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News