Tuesday, April 23, 2024

యుపిఎస్‌సి: సివిల్స్‌తో పాటు ఇతర పరీక్షలకు కొత్త షెడ్యూల్

- Advertisement -
- Advertisement -

UPSC New Schedule for Civil and Other Examinations

 

న్యూఢిల్లీ : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యుపిఎస్‌సి) అన్ని నియామక పరీక్షలకు కొత్త షెడ్యూల్ ప్రకటించింది. ఎన్‌డిఎ, ఎన్ఎ, సివిల్ సర్వీసెస్, ఐఎఫ్ఎస్, ఐఈఎస్, ఐఎస్ఎస్ ఎగ్జామ్స్, రిక్రూట్‌మెంట్ టెస్టులకు కొత్త తేదీలను శుక్రవారం విడుదల చేసింది. ఈ పరీక్షలన్నీ కరోనావైరస్ లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. ఈ ఏడాదిలోనే ఈ పరీక్షలన్నీ పూర్తి చేసేలా షెడ్యూల్ సిద్ధం చేసింది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. అధికారిక వెబ్‌సైట్ https://www.upsc.gov.in/ లో షెడ్యూల్ అప్‌డేట్ చేసింది. యుపిఎస్‌సి సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ 2020 అక్టోబర్ 4న, మెయిన్ ఎగ్జామ్ 2021 జనవరి 8న జరగనుంది.

నేషనల్ డిఫెన్స్ అకాడమీ-NDA, నావల్ అకాడమీ-NA ఎగ్జామినేషన్ 1- 2020 సెప్టెంబర్ 6

సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్- 2020 అక్టోబర్ 4

ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్- 2020 అక్టోబర్ 4

ఇండియన్ ఎకనమిక్ సర్వీస్ / ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ ఎగ్జామ్- 2020 అక్టోబర్ 16 నుంచి 3 రోజులు

కంబైన్డ్ జియో సైంటిస్ట్ మెయిన్ ఎగ్జామ్- 2020 ఆగస్ట్ 8 నుంచి 2 రోజులు

ఇంజనీరింగ్ సర్వీసెస్ మెయిన్ ఎగ్జామ్- 2020 ఆగస్ట్ 9కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామ్- 2020 అక్టోబర్ 22

సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ ఎగ్జామ్- 2020 డిసెంబర్ 20

నేషనల్ డిఫెన్స్ అకాడమీ-NDA, నావల్ అకాడమీ-NA ఎగ్జామినేషన్ 2- 2020 సెప్టెంబర్ 6

సివిల్ సర్వీస్ మెయిన్ ఎగ్జామ్- 2021 జనవరి 8 నుంచి 5 రోజులు

కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్-CDS ఎగ్జామ్ 2- 2020 నవంబర్ 8

ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ మెయిన్ ఎగ్జామ్- 2021 ఫిబ్రవరి 28 నుంచి 10 రోజులు

ఎస్ఓ/స్టెనో ఎల్‌డీసీఈ- 2020 డిసెంబర్ 12 నుంచి 2 రోజులు

రిజర్వ్‌డ్ ఫర్ యూపీఎస్‌సీ ఆర్‌టీ ఎగ్జామినేషన్- 2020 డిసెంబర్ 20

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News