Home జాతీయ వార్తలు కరోనాతో ప్రముఖ ఉర్దూ కవి కన్నుమూత

కరోనాతో ప్రముఖ ఉర్దూ కవి కన్నుమూత

Urdu Poet Rahat Indori Passed Awayభోపాల్: ప్రముఖ ఉర్దూ కవి రహత్ ఇందోరి(70) కరోనాతో కన్నుమూశారు. ఆయన కరోనా సోకడంతో శ్రీ అరబిందో ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆయనకు రెండు సార్లు గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన తుదిశ్వాస విడిచారు. కవిగా, పెయింటర్ గా, బాలీవుడ్ పాటల రచయితగా ఆయన మంచి గుర్తింపు పొందారు. రహత్ ఇందోరి సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు. కరోనా సోకడంతో ఆయన సోమవారం ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ గుండెపోటుతో చనిపోయారని శ్రీ అరబిందో ఆసుపత్రి వైద్యులు తెలిపారు. తనకు కరోనా సోకిందని, తాను త్వరగా కోలుకునేలా ప్రార్థనలు చేయాలని ఆయన సోమవారం సోషల్ మీడియా వేదికగా అభిమానులను కోరారు. ఇందోరి మృతిపై మధ్యప్రదేశ్ సిఎం శివరాజ్ సింగ్ చౌహాన్, కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి సానుభూతి ప్రకటించారు.