Friday, April 19, 2024

రైతులకు యూరియా అందుబాటులో ఉంది: నిరంజన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

Niranjanreddy

హైదరాబాద్: రైతులకు అవసరమైన యూరియా అందుబాటులో ఉందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఉద్దేశపూర్వక దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నామని, కరోనా విపత్తును గ్రహించి సిఎం కెసిఆర్ వ్యవసాయరంగానికి పలు మినహాయింపులు ఇచ్చారని పేర్కొన్నారు. మీడియాతో నిరంజన్ రెడ్డి మాట్లాడారు. వానా కాలానికి కావాల్సిన అన్ని రకాల ఎరువులు 22.30 లక్షల మెట్రిక్ టన్నులకు బదులుగా కేంద్రం 10.50 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను ఇచ్చేందుకు ఆమోదం తెలిపిందన్నారు. యూరియాను దశల వారీగా తెలంగాణను తీసుకొచ్చామని, జులై నెల కోటాను కేంద్రం సకాలంలో సరఫరా చేయలేదని, వెంటనే స్వయంగా సిఎం కెసిఆర్ కేంద్రమంత్రితో మాట్లాడడంతో వెంటనే జులై కోటా సరఫరా మొదలుపెట్టిందన్నారు. ఈ నెలకు రావాల్సిన కోటా 2.05 లక్షల మెట్రిక్ టన్నులకుగాను 1.06 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని నిరంజన్ రెడ్డి తెలియజేశారు.

మిగతా యూరియా నెలాఖరుకు పంపిస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారని చెప్పారు. సిఎం కెసిఆర్ వ్యవసాయరంగానికి ఇచ్చిన మినహాయింపులను కేంద్రం గుర్తించిందని, దేశంలోని ఇతర రాష్ట్రాలు అనుసరించాలని కేంద్రం ఆదేశించిన విషయాన్ని గుర్తు చేశారు. కరోనా సమయంలో రైతుల పంటలన్నీ 100 శాతం కొన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కొనియాడారు. కరోనా ఇబ్బందులు గమనించి సిఎం కెసిఆర్ వ్యవసాయంపై పలుమార్లు సుధీర్ఘ సమావేశాలు ఏర్పాటు చేసి మార్గదర్శనం చేశారన్నారు. 36 గంటల్లో 56 లక్షల మంది రైతుల ఖాతాలకు రైతుబంధు నిధులు చేరవేసిన సమర్థత వ్యవసాయ శాఖదని, ఇది ప్రపంచ రికార్డ్ మాత్రమే కాదని, శాఖ పనితీరుకు నిదర్శనమన్నారు. అంతా సమర్థంగా జరుగుతున్న చోట ప్రజల్లో ఏదో రకమైన ఆందోళన, గుబులు పుట్టించడానికి, రైతాంగం స్థైర్యం దెబ్బతీసేందుకు కొన్ని శక్తులు ఉద్దేశపూర్వకంగా పని చేస్తున్నాయని నిరంజన్ రెడ్డి చెప్పారు. రైతులు ఆత్మస్థైర్యం దెబ్బతీసే ప్రచారం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News