Home తాజా వార్తలు వస్తోన్న యూరియా

వస్తోన్న యూరియా

Urea

10వ తేదీ కల్లా 53 వేల మెట్రిక్ టన్నులు n నేరుగా గ్రామాల్లోకి
చేర్చేలా ప్లాను n నాలుగు పోర్టులకు ఎడిఎలను పంపిన రాష్ట్ర
వ్యవసాయ శాఖ n ఎప్పటికపుడు సమీక్షిస్తున్న వ్యవసాయ
ముఖ్యకార్యదర్శి పార్థసారధి, కమిషనర్ రాహుల్‌బొజ్జా

మన తెలంగాణ/హైదరాబాద్: యూరియా కొరత తీర్చేందుకు రాష్ట్ర వ్యవసాయ ఉన్నతాధికారులు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా వెంటనే నాలుగు పోర్టులకు ఒక్కొక్కరి చొప్పున నలుగురు వ్యవసాయ సహాయ సంచాలకులను పంపించా రు. పోర్టులకు వచ్చిన యూరియాను చకచకా లా రీల ద్వారా, గూడ్స్ రైళ్ల ద్వారా రాష్ట్రానికి సరఫరా చేయనున్నారు. కృష్ణపట్నం పోర్టుకు శివానంద్, గంగవరం పోర్టుకు తిరుపతి, కాకినాడకు తులసీరాం, వైజాగ్ పోర్టుకు మధుమోహన్‌లను పంపి ంచారు. నాలుగైదు రోజులపాటు వారక్కడే ఉండి యూరియాను రాష్ట్రానికి తరలించేలా కృషిచేస్తా రు. రవాణాకు సంబంధించి ఇబ్బందులు లేకుం డా ఉండేందుకు వ్యవసాయ శాఖ ముఖ్యకార్యద ర్శి సి.పార్థసారధి దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులతో మాట్లాడారు. కమిషనర్ రాహుల్ బొజ్జా కూడా ఎపి అధికారులు సహకరించి యూరియ త్వరగా తరలించేందుకు సహకరించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌లోని నాలుగు పోర్టుల్లో ఉన్న యూరియాను తెలంగాణకు తెప్పించేందుకు శనివారం 1300 లారీలను సిద్ధం చేసి ఉంచారు. రైతులు ప్రస్తుత అవసరాలకు మాత్రమే కొనుగోలు చేయాలని సూచించారు. కొరత ఉందని, మరింత కొరత ఏర్పడుతుందని అనుకోకుండా, అటువంటి వార్తాలను నమ్మకుండా పరిమితంగానే యూరియా కొనుగోళ్లు జరపాలన్నారు.

మరో మూడు రోజుల్లో మొత్తం సర్దుకుంటుందని, అన్నదాతలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఆది, సోమవారాల్లో 8 రేకులకు చెందిన 20,800 మెట్రిక్ టన్నుల యూరియాను తరలించేందుకు సన్నాహాలు చేసినట్లు పార్థసారధి తెలిపారు. లారీల ద్వారా, రైళ్ల ద్వారా యూరియాను అన్ని జిల్లాలకు సరఫరా చేస్తామన్నారు. శనివారం సాయంత్రానికి ఇప్పటికే అనుకున్న ప్రణాళిక ప్రకారం 6 రేకుల యూరియా రాష్ట్రానికి వచ్చిందని రాహుల్ బొజ్జా తెలిపారు. గంగవరం పోర్టులో వర్షం కురుస్తుండటంతో యూరియా డిశ్చార్జ్ శనివారం మొదలు కాలేదు. ఇక వైజాగ్ పోర్టుకు వెజెల్ రాలేదు. క్రిభ్‌కో హజిరా ప్లాంట్ నుంచి మూడు వేల మెట్రిక్ టన్నులు, కృష్ణపట్నం, కాకినాడ పోర్టుల నుంచి 5255 మెట్రిక్ టన్నుల యూరియా లోడింగ్ చేసినట్లు వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. కాకినాడ పోర్టు నుంచి ఇఫ్‌కో కంపెనీకి 2600 మెట్రిక్ టన్నులు, తమిళనాడు ప్లాంట్ నుంచి 1500 మెట్రిక్ టన్నులు, మంగళూర్ ప్లాంట్ నుంచి 1500 మెట్రిక్ టన్నులు చొప్పున శనివారం మొత్తం 13,856 మెట్రిక్ టన్నులు లోడింగ్ చేశారు.

సెప్టెంబర్ నెలలో మొత్తంగా 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేంద్రం రాష్ట్రానికి కేటాయింపులు చేసింది. 25 రేక్‌లకు గాను ఇప్పటికే 6 రేక్‌లు వచ్చాయి. మరో 11 రేక్‌లు రవాణాలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ నెల 10వ తేదీ కల్లా 53 వేల మెట్రిక్ టన్నులు రాష్ట్రానికి చేరేలా ప్లాన్ సిద్ధం చేసుకుని అమలు చేస్తున్నారు. నౌకశ్రాయాలకు వచ్చే యూరియా సాధారణంగా ఉండటం, వాటికి వేపపూత పూసేందుకు సమయం పడుతోందని అధికారులు చెబుతున్నారు.
ఐదు నెలల్లో 6.02 లక్షల మెట్రిక్ టన్నులు ఖతం
ఈ ఏడాది ఖరీఫ్‌కు కేంద్రం రాష్ట్రానికి 8.50 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయింపులు చేసింది. ఇందులో ఏఫ్రిల్ నుంచి ఆగస్టు నెల చివరి వరకు మొత్తం 6.02 లక్షల మెట్రిక్ టన్నులు అంటే 75.40 శాతం యూటిలైజ్ చేసుకున్నట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. ప్లాన్ ప్రకారం ఏఫ్రిల్ నెలలో 1.05 లక్షల మెట్రిక్ టన్నులు రావాల్సి ఉండగా 58 వేల మెట్రిక్ టన్నులు, మేలో 1.21 లక్షల మెట్రిక్ టన్నులకు బదులుగా 54 వేల మెట్రిక్ టన్నులు, జూన్‌లో 1.51 టన్నులకు గాను 72 వేల టన్నులు, జూలైలో 95 వేల టన్నులకు గాను 1.33 టన్నులు, ఆగస్టులో 2.21 లక్షల మెట్రిక్ టన్నులకు గాను 1.13 మెట్రిక్ టన్నులు వచ్చింది. ఆగస్టు వరకు 7.98 లక్షల మెట్రిక్ టన్నులు రావాల్సి ఉండగా, 4.30 లక్షల మెట్రిక్ టన్నులు సరఫరా జరిగిందని అధికార లెక్కలు చెబుతున్నాయి.

Urea shortage in Telangana