- Advertisement -
మనతెలంగాణ /పెద్దపల్లి రూరల్ ః మండలంలోని హన్మంతునిపేట గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు పోలుసాని సంపత్ రావు(36) తన నివాసంలో మంగళవారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతుడు అంకంపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాడు. గత కొంత కాలంగా నరాల వ్యాధి ఉండటం వలన కుడి చేతి పనిచేయటం లేదని, ఎన్ని సార్లు వైద్యం చేయించుకున్న నయం కాకపోవటంతో మనస్తాపానికి గురై ఆత్మహాత్యకు పాల్పడినట్టు తెలిపారు. సంపత్ రావుకు భార్య గీతా, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పెద్దపల్లి ఎస్సై జగదీష్ తెలిపారు.
- Advertisement -