Wednesday, March 22, 2023

ఊరూరా బెల్ట్ షాపులు!

- Advertisement -

belt-shop

*ఏరులై పారుతున్న కల్తీ మద్యం
*అమలుకాని ఎంఆర్‌పి ధరలు
*బలౌతున్న సామాన్యులు
*నిద్రావస్థలో ఎక్సైజ్ అధికారులు

ఇంటింటికీ మంచినీరు అందడం కష్టమవుతుందేమో.. కానీ మద్యం మాత్రం ఏరులై పారుతోంది. ప్రతి గ్రామంలో కనీసం రెం డు నుంచి నాలుగు బెల్ట్ షాపులు ఉంటున్నాయి. చిన్న కిరాణ కొట్టులో కూడా మ ద్యం బాటిళ్లు లభ్యమవుతున్నాయి. అయితే ఆయా షాపుల్లో లభించే మద్యం కల్తీగా ఉండటంతో సామాన్యులే బలవుతున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని దినసరి కూలీలు రోజంతా తాము చేసిన శ్రమను మర్చిపోవడానికి రాత్రికి మద్యం సేవిస్తుంటారు. ప్రతిరోజు కూలీ డబ్బులు రూ.200 సంపాదిస్తే అందులో సగం మద్యానికే ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది. ఇలా అనేక మంది సామాన్యులు మద్యంకు బానిసలై ఒళ్లు గు ల్ల చేసుకుంటున్నారు. ఫలితంగా అతనిపై ఆధారపడిన కుటుంబానికి అన్యాయం చే స్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 191 మద్యం షాపులు ఉన్నాయి. సంగారె డ్డి జిల్లాలో 85 మద్యం దుకాణాలు, సిద్దిపేట జిల్లాలో 69, మెదక్ జిల్లాలో 37 మద్యం దుకాణాలు ఉన్నాయి. అలాగే ఉమ్మడి మెదక్ జిల్లా లో మొత్తం 15 బార్లు ఉన్నాయి. ఆయా దుకాణాల ద్వారా ప్రతినెలా దాదాపు రూ.70కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరుతుంది. అంటే సంవత్సరానికి 840 కోట్ల రూపాయల ఆదాయం ఎక్సైజ్ శాఖకు వస్తోం ది. మద్యం వ్యాపారం ఎలాగైతేనేం తమకు ఎక్కువ ఆదాయం వస్తే చాల ని ఎక్సైజ్ శాఖ భావించడం వల్ల ఊరూరా బెల్ట్ షాపులు రాజ్యమేలుతున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ శాతం మద్యం తాగడం వల్లనే జరుగుతున్నాయని తేలడంతో 2004 సంవత్సరంలో ఎక్సైజ్ చట్టాలకు పదును బెట్టి రోడ్డు పక్కన ఉన్న దాబాల్లో మద్యం అమ్మకాలను పూర్తిగా నిషేదించారు. దీని కోసం ప్రత్యేకంగా ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాన్ని సైతం ఏర్పాటుచేశారు. ఈ విభాగానికి జిల్లాలో డిప్యూటీ కమిషన ర్ స్థాయి అధికారి వుంటారు. అయితే ఎక్సైజ్ అధికారులకు మద్యం విక్రయాలపై అనధికారికంగా లక్షాలు నిర్దేశించడంతో ఎక్సైజ్ అధికారులు విచ్చలవిడిగా బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తున్నారు.

జాతీయ రహదారిపై మద్యం వ్యాపారం లేకపోవడం వల్ల ప్రభుత్వానికి కొంత ఆదాయం తగ్గినట్లయింది. కాగా సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో గ్రామంలో కనీ సం నాలుగు బెల్ట్ షాపులు వుంటాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో దాదాపు మొత్తం 6వేల వరకు బెల్ట్ షాపులు వుంటాయని అంచనా. ఎక్సైజ్ అధికారులు ప్రతి బెల్ట్ షాపునకు ఒక రేటు పెట్టి పల్లెల్లో ప్రోత్సహిస్తున్నారు. వైన్స్ నిర్వాహకులు తమకు ఇచ్చిన టార్గెట్‌లు నింపుకోవడానికి బెల్ట్ షాపుల నిర్వాహకులను పోత్సహిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా పొరుగు రాష్ట్రాలైన కర్నాటక, మహారాష్ట్రల నుంచి జిల్లాకు విచ్చలవిడిగా మద్యం దిగుమతి అవుతోంది. మద్యం మాఫియాకు ఎక్సైజ్ అధికారులు, ప్రజాప్రతినిధులు అండదండలున్నాయని ఆరోపణలున్నాయి. దీంతో బెల్ట్ షాపుల్లోకి మహారాష్ట్ర సరుకు దిగుతోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో మద్యం వ్యాపారాన్ని శాసిస్తున్న కొంత మంది లిక్కర్ మాఫియా గోవా, కర్నాటక తదితర రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యాన్ని బెల్ట్ షాప్‌ల ద్వా రా గ్రామీణ ప్రాంతాల్లో విచ్చలవిడిగా విక్రయాలు జరిపి సొమ్ము చేసుకుంటున్నారు. మద్యం వ్యాపారంలో రాజకీయ నాయకుల పాత్ర ఎక్కువగా వుండటంతో ఆయా మండలాల నేతలకు ప్రతినెలా మామూళ్లు ము ట్ట జెబుతున్నారు. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో మద్యం వ్యాపారులు అధిక ఫీజులు చెల్లించి మద్యం దుకాణాలను చేజిక్కించుకున్న కారణంగా అత్యధికంగా లాభాలు పొందేందుకు బెల్ట్ షాప్‌లకు మద్యాన్ని ఎ క్కువగా సరఫరా చేస్తున్నారు. బెల్ట్ షాప్‌ల నీడన అక్రమ మద్యం విక్రయాలు జరుగుతున్నాయని ఎక్సైజ్ అధికారులకు తెలిసినప్పటికీ వారు నిద్రావస్థలో ఉన్నారు. కల్తీ మద్యం విక్రయాలు జోరుగా జరుగుతున్నాయని ప్రజలు భోరున విలపిస్తున్నా ఎక్సైజ్ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. దీంతో కల్తీ మద్యం తాగి ఉమ్మడి మెదక్ జిల్లాలో పదుల సంఖ్యలో నిరుపేదలు ప్రాణాలను కోల్పోతున్నా రు. ఇదిలా వుంటే మూడు జిల్లాలో మద్యం దుకాణాలతో పాటు బెల్ట్ షాప్‌లలో ఎంఆర్‌పి ధరల కంటే అధికంగా మద్యం విక్రయాలు జరుపుతున్నారు. క్వార్టర్, హాఫ్ బాటిళ్లపై రూ.10 నుంచి రూ.20 ఎక్కువగా వసూలు చేస్తున్నారు. దీంతో ఊరూరా బెల్ట్ షాప్‌లు మూడు పువ్వులు, ఆరు కాయలు అన్న చందంగా కొనసాగుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News