Home సినిమా ‘హేట్ స్టోరీ-4’లో…

‘హేట్ స్టోరీ-4’లో…

Urvashi

ఈమధ్య బాలీవుడ్‌లో శృంగారభరితమైన సినిమాలు రావడం ఎక్కువైంది. ఇటువంటి  సినిమాలు విజయాన్ని సాధించి మంచి కలెక్షన్లు వస్తుండడంతో ఈ జోనర్‌లో సినిమాలు తీయడానికి ఫిల్మ్‌మేకర్స్ ఉత్సాహపడిపోతున్నారు. సింపుల్ స్టోరీ, తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కే ఈ చిత్రంలో అందాల తారలే ప్రధాన ఆకర్షణ. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌లో ఇప్పటికే  ‘హేట్ స్టోరీ’ సిరీస్‌లో మూడు సినిమాలు వచ్చాయి. ఇప్పుడు హేట్ స్టోరీ-4 చిత్రాన్ని సిద్ధం చేస్తున్నారు ఫిల్మ్‌మేకర్స్. ఈసారి హీరోయిన్‌గా హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలాను ఎంపికచేశారు. ఈ భామ కొత్త స్టిల్‌ను తాజాగా రిలీజ్ చేశారు ఫిల్మ్‌మేకర్స్. యువకుల మతులు పోగొట్టేలా ఈ స్టిల్‌లో ఊర్వశి దర్శనమిచ్చింది. హేట్ స్టోరీ-4 సినిమాకు విశాల్ పాండ్య దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా పార్ట్ 2, పార్ట్ 3లకు కూడా అతనే దర్శకుడు. టి సిరీస్ ప్రొడక్షన్‌లో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాతో మరో హిట్‌ను అందుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు ఫిల్మ్‌మేకర్స్.