Friday, April 26, 2024

బన్నీతో కలిసి ఊర్వశి స్టెప్పులు

- Advertisement -
- Advertisement -

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో రానున్న ‘పుష్ప’ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతెలాను తీసుకోబోతున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఊర్వశి… బన్నీ సినిమాలో చేయబోతున్నానని ట్వీట్ చేసింది. ఆమె పోస్ట్ చేస్తూ..“డ్యాన్స్ లో నాకు స్ఫూర్తినిచ్చిన అల్లు అర్జున్‌తో కలిసి స్టెప్పులు వేయబోతున్నా. ‘పుష్ప’ సినిమాలో నా సౌత్ ఇండియన్ డ్యాన్స్ స్టైల్‌ని మీకు చూపించబోతున్నాను’ అంటూ ఊర్వశి రౌతెలా తన డ్యాన్స్‌కి సంబంధించిన వీడియోను పోస్ట్ చేసింది. ఈ చిత్రంలో బన్నీకి జోడీగా వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక మందన్న కథానాయికగా నటించనుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు.

Urvashi Rautela Special Song with Allu Arjun

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News