Home అంతర్జాతీయ వార్తలు భారత్‌కు వచ్చేవారం అమెరికా వెంటిలేటర్లు

భారత్‌కు వచ్చేవారం అమెరికా వెంటిలేటర్లు

US 100 Ventilators To India Next Week

 

వాషింగ్టన్ : భారత్‌కు అమెరికా విరాళంగా ఇస్తానన్న వెంటిలేటర్లలో మొదటి విడతగా వంద వెంటిలేటర్లను వచ్చే వారం పంపనున్నట్టు వైట్‌హౌస్ వెల్లడించింది.

నిన్న ఫోన్ సంభాషణలో అధ్యక్షుడు ట్రంప్ ప్రధాని మోడీకి ఈ విషయం వివరించారని తెలియచేసింది. ఈ విషయంలో భారత్‌కు సహాయం చేసే అవకాశం రావడంపై ట్రంప్ సంతోషం వ్యక్తం చేశారని వివరించింది. ఈ రోజు మొదట్లో ప్రధాని మోడీ తన మిత్రుడు ట్రంప్‌తో సుహృద్భావ సంభాషణ జరిగిందని చెప్పారు. జి7 సదస్సు, కరోనా మహమ్మారి నియంత్రణ, ఇతర ముఖ్యమైన అంశాలపై చర్చించామని, మోడీ తెలిపారు. జి 7 లో మరికొన్ని దేశాలను చేర్చి దేశాల సభ్యత్వాన్ని విస్తరించనున్నట్టు ట్రంప్ మోడీకి వివరించారు. ఈ సందర్భంగా జి 7 సదస్సుకు రావలసిందిగా ప్రధాని మోడీని ఆహ్వానించారని ప్రధాని కార్యాలయం ప్రకటించింది.

జి 7 సభ్యత్వ విస్తరణ వల్ల ఆయా దేశాల కరోనా ప్రభావం తరువాతి వాస్తవాలు తెలుసుకోడానికి వీలవుతుందని ట్రంప్ ముందుచూపుతో, సృజనాత్మకతతో వ్యవహరించడాన్ని మోడీ ప్రశంసించారని వివరించింది. సదస్సు ప్రతిపాదనలను విజయవంతం చేయడంలో అమెరికాతోపాటు మిగతా దేశాలతో కలసి భారత్ సంతోషంగా పనిచేస్తుందని ట్రంప్ ఈసందర్భంగా తన అభిప్రాయం వెలిబుచ్చారు. ఇరు దేశాల నేతలు కరోనా ఉధృతి, భారత్‌చైనా సరిహద్దు పరిస్థితి, ప్రపంచ ఆరోగ్య సంస్థలో సంస్కరణల ఆవశ్యకత, తదితర ముఖ్యాంశాలపై చర్చించారు.

US 100 Ventilators To India Next Week